• HOME
  • అందం
  • చక్కని ముఖ సౌందర్యం కోసం

మన శరీరాన్ని అన్ని రకాల వాతావరణ  ప్రభావాల నుంచి కాపాడే అవయవం చర్మం. మిగిలిన రోజులతో పోల్చినప్పుడు ఎండా కాలంలో చర్మం ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంది. ఇతర శరీర భాగాలకు దుస్తులు ఎంతో కొంత రక్షణ కల్పించినప్పటికీ ముఖం విషయంలో మాత్రం ఈ వెసులు బాటు అంతగా ఉండదు. ఈ వేసవిలో ఉక్కపోత, ఎండ,  దుమ్ము, ధూళి ప్రభావాల బారి నుంచి ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవటం ఒక రకంగా సవాలే అయినా కొన్ని చర్మ సంరక్షణా విధానాల సాయంతో ముఖ చర్మాన్ని సమర్ధవంతంగా కాపాడుకోవచ్చు. అవి..

ఆయిల్ క్లీనింగ్

వంటింట్లో వాడే ఆముదం, ఆలివ్, కొబ్బరి, నువ్వుల నూనెలు చర్మంలోని వ్యర్ధాలను వెలికి తీసే గుణం ఉంది.  రోజుకో నూనెతో చర్మాన్ని సున్నితంగా మర్దన చేసుకుంటే  పొడిబారిన చర్మానికి అవసరమైన తేమ అందటమే గాక ముదతలేమైనా ఉన్నా తొలగి పోతాయి.  గోరువెచ్చగా ఉన్న నూనెను ముఖం, మెడ భాగాలకు పట్టించి, పది నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. దీనివల్ల ముఖ చర్మం మీద పేరుకున్న వ్యర్ధాలు తొలగి పోవటమే గాక లోలోపలి పొరల్లో చేరిన వ్యర్ధాలు సైతం తొలగిపోతాయి. ముఖ భాగపు కండరాల కదలికలు, రక్త ప్రసరణ మెరుగు పడతాయి. మర్దన తర్వాత గోరు వెచ్చని నీటిలో ముంచి, పిండిన మెత్తని బట్టను అయిదు నిమిషాలపాటు ముఖం మీద కప్పి, ఆ తర్వాత శుభ్రంగా తో ముఖం, మెడ భాగాలను తుడవాలి. దీనివల్ల  మిగిలిపోయిన వ్యర్ధాలు సైతం తొలగి పోతాయి. అయితే జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ఆయిల్ క్లీనింగ్ విధానం పనికిరాదు.

క్లీన్ అండ్ స్క్రబ్బింగ్

ముందుగా ముఖాన్ని ఏదయినా జెల్ తో శుభ్రం చేసి ఆ తర్వాత ఫేషియల్ స్క్రబ్బర్ తో సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత చక్కెర లేదా కందిపప్పు పొడిని కొంచెం నీటితో కలిపి పేష్టులాగా చేసి  ముకహానికి పట్టించి సున్నితంగా మర్దన చేయాలి. అయిదు నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని బాగా కడిగి ఆ తర్వాత చల్లని నీటితో  మరోమారు శుభ్రం చేయాలి. ఈ విధానం వల్ల చాలాకాలంగా పొరల రూపంలో పేరుకుపోయిన వ్యర్ధాలు వదిలి పోతాయి.

స్క్రబ్బింగ్ అండ్ వాషింగ్

రెండు, మూడు నిమిషాల్లో ముఖాన్ని శుభ్ర పరచుకునే సులువైన పద్దతి ఇది. రోజూ వాడుతున్న ఫేస్ వాష్ కు కందిపప్పు పొడి లేదా చక్కర పిండిని కలుపుకొని ముద్దగా చేసుకుని చివరగా దానికి తగినంత మాయిశ్చరైసర్  కలపాలి. ఈ ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుని అయిదు నిమిషాల పాటు ముఖాన్ని మర్దనా చేసి, ఆరనిచ్చి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేయటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

శనగపిండి, పసుపు మిశ్రమం

రెండు చెంచాల శనగ పిండిలో రెండు చిటికెల పసుపు, అర చెంచా రోజ్ వాటర్, చెంచాడు పాలు, తగినంత కలబంద(అలోవేరా) గుజ్జును కలిపి ముద్దలాగా చేసుకోవాలి. దీనిని ముఖానికి పట్టించి కొద్దిగా ఆరనిచ్చి, బయటి వైపుకు మర్దనా చేయాలి. అయిదు నిమిషాల మర్దన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. దీనివల్ల చర్మం శుభ్ర పడటమే గాక కాంతివంతంగా మారుతుంది. పసుపు కారణంగా బాక్టీరియాలు కూడా దూరమవుతాయి.

 

   చర్మ సౌందర్యం మొదలు చర్మ సమస్యల వరకు ఏమైనా సమస్యలు ఉంటే నిపుణుల సలహా కోరటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE