• HOME
 • అందం
 • చర్మ సమస్యలకు గృహవైద్య చికిత్స

మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మమే. ప్రకృతిపరమైన మార్పుల బారిన ఎక్కువగా పడేదీ చర్మమే. వ్యక్తిగత శుభ్రతా లోపం, శారీరక మార్పులు వంటి ఎన్నో కారణాల వల్ల చర్మం దెబ్బతినటం సహజమే. ఈ సందర్భాల్లో గృహవైద్యం చక్కగా పనిచేస్తుంది. ఆ వివరాలు...

 • దురదలు, దద్దుర్లు వేధిస్తుంటే స్నానపు నీటిలో గుప్పెడు కళ్లుప్పు, ఒక నిమ్మకాయ పిండి ఆ నీటితో స్నానం చేస్తే సమస్య తగ్గటమే గాక శరీరం కాంతివంతమవుతుంది.
 • గజ్జి, తామర లక్షణాలు కనిపించిన వెంటనే తులసి ఆకు నూరి అందులో నిమ్మరసం కలిపి పట్టిస్తే లక్షణాలు మాయమవుతాయి. లేదా కిరోసిన్ రాసినా చాలు.
 • ఒంటిపై తెల్ల మచ్చలు కనిపిస్తే వాటిపై తెల్ల గన్నేరు ఆకులు నూరి లేపనంగా పూస్తే మచ్చలు మాయమవుతాయి.
 • తెల్ల బొల్లి మచ్చలకు మినుములను నీటితో నూరి పట్టిస్తుంటే క్రమంగా ఆ మచ్ఛలు పోతాయి.
 • తులసి ఆకు, హారతి కర్పూరం కలిపి నూరి రాత్రిపూట శోభి మచ్చలపై రుద్ది తెల్లారి కడగాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే శోభిమచ్చలు శరీరంలో కలిసిపోతాయి.
 • అరికాళ్లలో ఆనెలు పెరిగి ఇబ్బందిగా ఉన్నప్పుడు వారంపాటు జిల్లేడు పాలు, ఆముదం సమంగా కలిపి రుద్దితే ఆనెలు హరించిపోతాయి.
 • 5 గ్రాముల తేనె, 8 గ్రాముల . నెయ్యి కలిపి పూస్తుంటే అధిక వేడి వల్ల ఒంటిపై పడిన తీవ్రమైన వ్రణాలు మానిపోతాయి.
 • వాతావరణ మార్పుల మూలంగా దురదలు, దద్దుర్లు వస్తే నిప్పుల మీద వాము చల్లి ఆ పొగను ఒంటికి పారేలా చేస్తే సరి.
 • 3 గ్రాముల పసుపు, 6 గ్రాముల ఉసిరి పొడి గ్లాసు నీటిలో కలిపి సేవిస్తుంటే రక్తశుద్ధి జరిగి చర్మ సమస్యలు రావు.Recent Storiesbpositivetelugu

సంతోషమయ జీవితానికి..

మనిషి సంతోషంగా జీవితాన్ని గడపాలంటే సంతృప్తి చాలా అవసరం. అయితే మనిషి కోరికలు అనంతం. ఎన్ని కోరికలు తీరినా, మళ్లీ 

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE