• HOME
  • అందం
  • మానసిక సౌందర్యమూ ముఖ్యమే

   అందం అయస్కాంతం వంటిది. అది మంచి మానవ సంబంధాలకు ఒక ప్రాతిపదిక. అయితే.. అందం అంటే కేవలం కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు. మేలైన గుణగణాలు, విశిష్ట వ్యక్తిత్వ శోభతో పొందే మానసిక సౌందర్యం కూడా మనిషికి ముఖ్యమే. కంటికి కనిపించే అందం కాలంతో కరిగిపోతుంది గానీ ఈ మానసిక సౌందర్యం మాత్రం వయసుతోపాటు పెరుగుతూ ఉంటుంది. 

మానసిక సౌందర్యాన్ని పొందాలంటే..

  • దాపరికం లేకుండా మాట్లాడాలి. చెప్పదలచుకొన్న విషయాన్ని సూటిగా వెల్లడించాలి.
  • పెదాల మీది చిరునవ్వును ఎప్పుడూ చెరగనీయకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి.
  • డిజైనింగ్ దుస్తులు వాడలేకపోయినా శుభ్రంగా ఉన్న దుస్తులు ధరిస్తే చాలు.
  • మాట్లాడే వ్యక్తి కళ్లలోకి సూటిగా చూడటం అలవాటు చేసుకోవాలి.
  • ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా విని, తర్వాత మనోభావాలను వ్యక్తీకరించాలి.
  • ఒకరితో మాట్లాడుతున్నపుడు మరొకరిని పొగడకూడదు లేదా నిందించకూడదు.
  • మాటల్లో వ్యక్తంకాని విషయాలను సున్నితమైన బాడీ లాంగ్వేజ్‌ ద్వారా చెప్పాలి.
  • చిన్న, పెద్ద తేడాలు లేకుండా అందరిపట్లా గౌరవ మర్యాదలు ప్రదర్శించాలి.
  • పని విషయంలో క్రమశిక్షణను పాటించాలి.
  • అవసరమైనప్పుడు మృదు భాషణతో ఎదుటివారి స్పందనను అంచనా వేసి దాన్ని బట్టి మనసులోని భావాలను వెల్లడించాలి.
  • అవతలివారు మనతో మాట్లాడటం ఓ ఆనందకరమైన విషయంగా పరిగణించేలా నడచుకోవాలి.
  • ఉన్నంతలో పోషక ఆహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE