• HOME
  • అందం
  • జుట్టు రాలకుండా ఉండాలంటే..!

జుత్తు అందాన్ని రెట్టింపు చేస్తుంది.  అందమైన జుత్తును సొంతం చేసుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. జుత్తుని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, ఎంత పోషణ చేసినా ఊడిపోవడం సహజమే. కొందరిలో ఇది మరింత ఎక్కువగా ఉండటం కనిపిస్తుంది .  అలా ఊడిపోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..

  • పెసలు ఉడికించి ముద్దగా చేసి దానిలో కొద్దిగా మెంతిపొడి కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది.
  • పచ్చి ఉసిరికాయలను దంచి ముద్దగా చేసుకొని రసం పిండి దానికి అంతే మొత్తంలో నిమ్మరసం జత చేసి ఈ మిశ్రమాన్ని షాంపూతో పాటు తలకి రాసుకొని ఆరిన తర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాలు చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
  • కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన కూడా జుత్తు ఊడటాన్ని నిరోధించ వచ్చు.
  • ఎండు ఉసిరికాయ ముక్కలను కొబ్బరినూనెలో వేసి వేడిచేసి రాత్రంతా ఉంచి మరుసటి రోజు ఆ నూనెను తలకు రాసుకోవాలి. ఇలా 2 వారాలు వాడితే చక్కని గుణం కనిపిస్తుంది.
  • రోజూ కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి జుత్తుకు రాస్తే ఊడటమే గాక చక్కని నిగారింపు కూడా వస్తుంది.
  • నిమ్మగింజలు, మిరియాలు కలిపి ముద్దగా నూరుకొని ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి ఆరిన తరువాత స్నానం చేస్తే జుట్టు మృదుత్వం సంతరించుకుంటుంది.
  • ఒక గ్రాము మిరియాల పొడి, వందగ్రాముల పెరుగులో కలిపి ఈమిశ్ర మాన్ని తలకుపట్టించి, ఆరిన తరువాత తలస్నానం చేయాలి.
  • రోజూ బాదం నూనెతో కుదుళ్ళ నుండి మూడు సార్లు మర్దన చేసుకోవాలి.బాదం నూనె జుట్టు రాలటాన్ని బాగా తగ్గిస్తుంది. ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు కూడా మృదుత్వం సంతరించుకుంటుంది.



Recent Stories







bpositivetelugu

ధన్యజీవులు

 అభిరుచి మేరకు మనిషి ఏ రంగంలోనైనా ఎదగవచ్చు. అయితే , ఆ రంగంలో తాను ఉన్నత స్థితికి చేరేనాటికి, 

MORE
bpositivetelugu

ఐక్యతానురాగాల ప్రతీక.. రక్షాబంధన్

  దేవతారాధన, ప్రకృతి ఆరాధన, ఆత్మీయతానురాగబంధాల కలయికే శ్రావణ మాసం. ఈ విషయంలో ఈ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత 

MORE