• HOME
  • అందం
  • చలికాలంలో పాదాల సంరక్షణ

చలికాలంలో చర్మం ఎక్కువగా పొడిబారి పగుళ్ళు, చారికలు ఏర్పడటం సహజమే. ఈ క్రమంలో ఎక్కువగా ప్రభావితమయ్యేది పాదాలే. ఈ కాలి పగుళ్లను నిర్లక్ష్యం చేస్తే వీటి నుంచి రక్తస్రావం కూడా కావచ్చు. మధుమేహుల్లో ఇది తీవ్రమైన ఇబ్బందిగా మారొచ్చు. ఈ సమస్య ఉన్నవారు నలుగురిలోకి చొరవగా వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఈ శీతాకాలంలో పాదాల సంరక్షణ విషయంలో కొద్దిగా శ్రద్ధ తీసుకొంటే పాదాలను కోమలంగా ఉంచుకోవచ్చు.

ఇవీ జాగ్రత్తలు

  • పాదాలు పగుళ్ల బారిన పడకుండా ఉండేందుకు 15 రోజులకోసారి పెడిక్యూర్ చేయించాలి. ఇంట్లో కూడా పెడిక్యూర్ చేసుకోవచ్చు. ఒక బకెట్టులో గోరు వెచ్చని నీరు తీసుకొని అందులో గుప్పెడు రాతిఉప్పు, డెటాల్, షాంపూ వేసి కలిపి ఆ నీటిలో అరగంటపాటు పాదాలను నానబెట్టి బయటకు తీసి ప్యూమిక్‌స్టోన్ లేదా స్క్రబ్బింగ్ స్టోన్ లేదా బ్రష్ తో రుద్దాలి. దీనివల్ల పాదాల మీది మృతకణాలు తొలగిపోతాయి. ఆ తరువాత ఒక నిమ్మ చెక్క మీద 2 చుక్కల గ్లిజరిన్ వేసి పాదాలను రుద్ది చన్నీటితో కడిగి చివరగా కొద్దిగా ఆలివ్ ఆయిల్‌ రాస్తే చాలు.
  • 1 చెంచా ముల్తానీ మట్టిలో 4 చెంచాల రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి పావుగంట తర్వాత చన్నీటితో కడిగి మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే పాదాల మీది మృతకణాలు పోయి.. మృదువుగా మారతాయి.
  • రాత్రి పడుకోబోయే ముందు రోజ్ వాటర్, గ్లిజరిన్‌ సమపాళ్లలో కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. మర్నాడు లేవగానే గోరువెచ్చటి నీటిలో కొద్దిగా షాంపూ కలిపి కడిగి ఫుట్‌క్రీమ్‌ లేదా లోషన్‌గానీ పాదాలకు రాస్తే సరి.
  • రోజూ స్నానం చేసేటపుడు పాదాలను ప్యూమిన్ రాయితో రుద్ది ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె రాసినా పదాలు పగలవు.
  • చలికాలంలో పాదాల సంరక్షణకు మెత్తని నూలు సాక్సులు వాడటం మంచిది. అయితే ఎప్పటికప్పుడు ఈ సాక్సులు ఉతకకపోతే దుమ్ము, మురికి చేరి పాదాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంటుంది.
  • గట్టిపడి, పగుళ్లిచ్చిన పాదాలకు రోజూ రాత్రి నిద్రకు ముందు గోరు వెచ్చని కొబ్బరినూనె రాసి సున్నితంగా మర్దన చేస్తే ఆ భాగంలో రక్తప్రసరణ పెరిగి నెమ్మదిగా పగుళ్లు మాయమవుతాయి.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE