• HOME
  • అందం
  • చలి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. 

      వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చలి ధాటికి ముఖ చర్మం చెప్పలేనంతగా పొడిబారిపోతోంది. చర్మానికి తగినంత తేమను అందించటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. అలాగని ఎడాపెడా క్రీమ్స్ వాడాల్సిన పనిలేదు. ఈ దిగువ చిట్కాలను పాటిస్తే చాలు. అవి...     

  • చెంచాడు చొప్పున అరటిపండు గుజ్జు, వెన్న లేదా మీగడ తీసుకొని బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాయాలి. దీనివల్ల చర్మానికి సహజసిద్ధమైన తేమ అంది చర్మం పొడి బారదు.
  • ఉడికించిన బంగాళాదుంపని మెత్తగా మెదిపి అర చెంచా పెరుగు కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తరువాత నీటితో కడిగితే నల్లబడ్డ చర్మం అసలు రంగులోకి మారటమే గాక ముక్కు, మొహం మీది టాన్‌ వదిలిపోతుంది.
  • చెంచా చొప్పున తేనె, రోజ్‌వాటర్‌ కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేయాలి. తేనె సహజ మాయిశ్చరైజర్‌గానూ, రోజ్‌వాటర్‌ చర్మాన్ని టోనర్ గా పనిచేసి చర్మం సున్నితంగా మార్చుతాయి. 
  • క్యారెట్‌ గుజ్జు 2 చెంచాలు, చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 10 నిమిషాల తరువాత కడిగేయాలి. దీనివల్ల పొడి చర్మానికి సాంత్వన లభించటమే గాక నల్లబడ్డ చర్మం సైతం కాంతులీనుతుంది. 
  • తేనె 2 చెంచాలు, 4 చెంచాల పెరుగు కలిపి ముఖానికి, మెడకు ప్యాక్‌ వేసి పావుగంట తరువాత చన్నీటితో కడిగితే పొడిబారిన చర్మం మెత్తబడుతుంది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

మోక్షదాయని.. ముక్కోటి ఏకాదశి

తిథులలో ఏకాదశి ఎంతోవిశిష్టమైనది. శివకేశవులిద్దరికీ ఇష్టమైన ఈ తిథినాడు పగటి ఉపవాసంతో దైవారాధన, రాత్రి భగవన్నామ

MORE