• HOME
  • అందం
  • సన్నబడాలంటే ఇలా చేయాల్సిందే

  ఈ రోజుల్లో ఆరోగ్య సృహ పెరగటంతో బాటు సౌందర్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతోంది. దీంతో తిండి తగ్గించి ఎడాపెడా కసరత్తు చేయటం కనిపిస్తోంది. అయితే పటిష్టమైన, నాజూకైన శరీరాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని నియమాలను తప్పక పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.అవి...  

  • బ్రష్ చేసిన వెంటనే గోరు వెచ్చని నీటిలో నిమ్మ చెక్కను పిండి, చెంచా తేనె కలిపి తాగితే కొవ్వు కరగటమే గాక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
  • రోజూ ఉదయాన్నే గంటసేపైనా రన్నింగ్, జాగింగ్ చేయాలి. బయటికి వెళ్లలేకపోతే ట్రెడ్ మిల్ వాడినా చాలు.
  • వ్యాయామం తర్వాత కాఫీ, టీ కు బదులు ఓ కప్పు గ్రీన్ టీ తాగాలి. ఇందులోని 'కెటాచిన్' అనే రసాయనం కొవ్వును బాగా కరిగిస్తుంది.
  • రోజూ క్రమం తప్పక మంచి పోషక భరితమైన అల్పాహారం తీసుకోవాలి. ఇందులో పండ్ల రసాలు, ఎగ్ వైట్ వంటివి ఉండాలి.
  • మెలకువగా ఉన్నప్పుడు గంటకోసారైనా కొద్దికొద్దిగానైనా నీరు తాగుతూ ఉండాలి. ఎంత తాగితే అంత మంచిది. కూల్ డ్రింకుల జోలి వద్దు.
  • బరువు తగ్గాలంటే బద్దకాన్ని వదిలించుకోవాలి. ఉదయం వ్యాయామం చేసి రోజంతా కూర్చుని, పడుకొని ఉంటే ఏ మార్పూ రాదు. రోజంతా శరీరానికి కదలిక అవసరం.
  • బరువు తగ్గాలంటే వేళకి తినటం, పడుకోవటం చేయాలి. అప్పుడే జీవక్రియలు సరిగా జరుగుతాయి. రాత్రి ఎక్కువసేపు మేలుకోవటం, పగటిపూట నిద్ర పనికిరాదు.
  • సాయంత్రం పూట చిరుతిండిగా జంక్ ఫుడ్, సమోసా, బజ్జీలకు బదులు గ్రీన్ సలాడ్, పండ్లు, నువ్వుల ఉండలు, మొలకలు, ఉడికించిన గింజల వంటివి తీసుకోవాలి.
  • రాత్రి 8 గంటలకల్లా భోజనం ముగించాలి. భోజనానికి నిద్రకు మధ్య కనీసం 2 గంటలు వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

 



Recent Stories







bpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE