మాఘమాసం పెళ్లిళ్ల సమయం. సహజంగానే అందం విషయంలో శ్రద్ధ చూపే అమ్మయిలు పెళ్లి అనగానే సౌందర్య పరిరక్షణ గురించి మరికాస్త ఆలోచనలో పడుతుంటారు. కాబోయే పెళ్లి కూతుళ్ళంతా కనీసం నెల ముందు నుంచైనా సౌందర్య పరి రక్షణ మీద దృష్టి పెడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారు సూచిస్తున్న కొన్ని సలహాలు... 

  • పెళ్లికి 15 రోజుల ముందు నుంచి 3 రోజులకోసారి  ముఖం, మెడ, చేతులకు ఫ్రూట్ మసాజ్, ప్యాక్స్‌ వేసుకొంటే ముఖం ఆకర్షణీయంగా, సౌందర్యవంతంగా మారుతుంది.
  • కళ్ల కింద నల్లని వలయాలున్నవారు పెళ్ళికి నెల రోజుల ముందు నుంచే రోజూ కళ్ల కింద రోజ్‌వాటర్‌ లో ముంచిన కాటన్‌ క్లాత్‌ ను లేదా కాటన్ బాల్స్ ను 1 గంట పాటు పెడితే కళ్లు ఆకర్షణీయంగా ఉండడంతో పాటు నల్లని వలయాలు మాయమవుతాయి.
  • కాబోయే పెళ్లి కూతురికి కంటి నిండా నిద్ర అవసరం. పెళ్లి పిలుపుల పేరిట పొద్దుపోయే వరకు ఫోన్స్‌ చేయటం, గంటలు గంటలు అబ్బాయి, అమ్మాయిల ఫోన్‌ సంభాషణలు తగ్గించుకొని వేళకి పడుకోవాలి.
  • సౌందర్య పరిరక్షణలో ఫేస్‌ క్లెన్సర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ముఖ చర్మంపై గల వ్యర్ధాలను వదిలించి చర్మం మెరిసేలా చేస్తుంది. దీని వినియోగం వల్ల ముఖ కండరాలకు తగిన మసాజ్‌ అంది రక్తప్రసరణ పెరిగి తాజాగా కనిపిస్తుంది.
  • రోజూ ఉదయం నిద్ర లేవగానే చల్లని నీటితో ముఖం కడుక్కొంటే ముఖం తాజాగా మారుతుంది.
  • జిడ్డు చర్మం గలవారు ఓట్స్‌ పిండిలో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరిన తర్వాత నీటితో కడిగితే జిడ్డు వదిలి మొటిమలు రాకుండా ఉంటాయి.
  • వేపుళ్లు, జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారు వాటికి దూరంగా ఉండటంతో బాటు పరగడుపునే నిమ్మరసం, తేనెలను కలిపి తాగాలి. దీనివల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరుగుతుంది.
  • డిటర్జెంట్స్ తో పాత్రలు కడగటం, బట్టలు ఉతకడం వంటి పనులు తగ్గించుకోవాలి. లేకుంటే చేతి, వేళ్ళ చర్మం మొద్దుబారిపోతుంది. అలాగే.. వేళ్ల ఆకృతిని బట్టి గోళ్లు అందంగా కట్‌ చేసుకోవటం, రాత్రిపూట వేళ్లకి, చేతులకి, పెదాలకి కోల్డ్‌క్రీమ్‌ రాయటం చేయాలి.
  • పెళ్లికి ముందునుంచే రోజూ కొద్దిగా పంచదార, నిమ్మరసం అరచేతుల్లోకి తీసుకుని చేతులు, వేళ్ళ భాగంలో బాగా రుద్దాలి. దీనివల్ల చేతివేళ్ల చర్మానికి మెరుపు వస్తుంది. తేనెతో కూడా ఇలా చెయ్చొచ్చు.
  • రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగాలి. దీనివల్ల మంచి నిద్ర పట్టి ఒత్తిడి వదిలిపోతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE