సుకుమారమైన అమ్మాయి చేతులకు గోరింటాకు మరింత అందాన్ని తీసుకొస్తుంది. ప్రస్తుతం సౌందర్యానికి పెరుగుతున్న ఆదరణ దృష్టిలో ఉంచుకుని ఆకర్షణీయమైన డిజైన్లను రూపొందిస్తున్నారు ఫ్యాషన్‌ ప్రియులు.వీటితో మృదువైన చేతుల్ని ముద్దులొలికే విధంగా చేసుకోవచ్చు.ఎంతో కష్టపడి వేసుకున్న డిజైన్లు చెరిగిపోకుండా ఎక్కువకాలం ఉండాలంటే కింది సూచనలు పాటించొచ్చు.

  • గోరింటాకు పెట్టిన తర్వాత వెంటనే కడిగేయకుండా వీలున్నంత ఎక్కువ సమయం ఆరనివ్వాలి 
  • గోరింటాకు పెట్టిన చేతులమీద చక్కెర, నిమ్మరసాల మిశ్రమాన్ని మాటిమాటికీ చల్లటం వల్ల చక్కగా పండుతుంది.
  • పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడిచేసి వచ్చే పొగలో గోరింటాకు పెటుకున్న చేతులను ఉంచితే అద్భుతంగా పండుతుంది .  
  • ఆరుతున్న గోరింటాకును మాటిమాటికీ చేతులతో కదపరాదు.
  • గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లల్లో నానబెట్టి అందులో ఒక అరచెమ్చా కాసు వేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. 
  • పుదీనా ఆకు లేక నూనెను గోరింటాకు ముద్దలో కలిపి పెట్టుకుంటే అది బాగా ఎర్రగా పండుతుంది.
  • ఒకసారి రుబ్బిన గోరింటాకును ఫ్రిజ్ లో పెట్టుకొని వారం తర్వాత కూడా వాడుకోవచ్చు.
  • గోరింటాకు పెట్టుకునేముందు చేతులను శుభ్రంగా కడుక్కుని నిమ్మచెక్కను బాగా చేతులకు పట్టించిన తర్వాత పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.
  • గోరింటాకు ఎర్రగా పండి చేతులు నల్లగా కనిపిస్తాయి. అలా కనబడకుండా ఉండాలంటే గోరింటాకు ఆరిన తర్వాత చిన్న గ్లాసులో పంచదార నీళ్ళు కలిపి ప్రతి పదినిముషాలకు ఒకసారి చేతులపై చల్లితే ఎర్రగా, గోరింటాకు పోయేముందు మచ్చలు రావు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE