• HOME
  • అందం
  •  డ్రయ్యర్‌ వినియోగం..సూచనలు 

       కాలంతో బాటు ఉద్యోగాలకు పరుగులు పెట్టేవారు కేశ సంరక్షణకు తగిన సమయం కేటాయించటం కష్టమైన పనే. సాధారణంగా ఒత్తైన శిరోజాలున్న మహిళలు, ఉద్యోగినులు ఉదయం వేళ తలస్నానం చేసినప్పుడు ఓపికగా జుట్టు తుడిచి ఆరబెట్టుకొని దువ్వుకొనేంత సమయం ఉండదు. దీనికి తోడు ప్రతిరోజూ తలస్నానం చేసేవాళ్లు పెరగడంతో బ్లో డ్రయ్యర్‌ వాడకం గణనీయంగా పెరుగుతోంది. అయితే తలస్నానం చేసిన ప్రతీసారీ బ్లో డ్రయ్యర్ వాడటం వల్ల జుట్టు చివరలు చిట్లిపోవటం, మాడుమీది సహజ తైలాలు తగ్గిపోయి జుట్టు పొడిబారి కళ తప్పటం, జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే తడితలని కాస్త ఆరనిచ్చి ఆ తర్వాతే డ్రయ్యర్‌ని వాడటం మంచిది. అలానే సూర్యరశ్మి ప్రభావానికి జుట్టు దెబ్బతినకుండా హీట్‌ప్రొటెక్షన్‌ స్ప్రేలు వాడటం మంచిది. డ్రయ్యర్‌ని వాడేటప్పుడు జుట్టుకు కాస్త దూరంగా పెట్టి వాడటంతో బాటు తక్కువ వేడి ఉండేలా చూసుకోవటం మరచిపోకూడదు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

నేడే శుభ శుక్రవారం

మానవాళి పాపాలను దేవుని కుమారుడైన  ఏసుక్రీస్తు తాను  శిలువనెక్కి మోశారు. సిలువపై ఆయన తన రక్తాన్ని చిందించి సమస్త 

MORE