అందంలో కురుల పాత్ర ఎంతో కీలకం. ఇప్పటి రోజుల్లో జుట్టు సహజ జుట్టు స్వభావంతో నిమిత్తం లేకుండా కోరిన రీతిలో దాన్ని మలచుకొని అవకాశం ఉంది. వీటిలో స్ట్రెయిటనింగ్ ఒకటి. అంటే.. ఐరనింగ్ సాధనాల సాయంతో రింగులుగా ఉన్న జుట్టును బారుగా కనిపించేలా చేయటం. అయితే తరచూ ఇలా చేయటం వల్ల మాడు మీది సహజ తైలాలు తగ్గిపోయి జుట్టు పొడిబారి కళ తప్పటం, జుట్టు పల్చబడటమే గాక ఊడిపోయే ముప్పూ ఉంది. కొన్నిసార్లు వాటివల్ల చర్మానికీ హాని జరగొచ్చు. కనుక జుట్టు స్ట్రెయిటనింగ్ చేయించుకొనేవారు కింది అంశాల గురించి తప్పక అవగాహన పెంచుకోవాలి.
- జుట్టు స్ట్రెయిటనింగ్ చేయడానికి ముందు నాణ్యమైన షాంపూతో తలస్నానం చేయాలి. తర్వాత కండిషనర్ కూడా తప్పనిసరిగా వాడాలి. ఉపయోగించాలి. కండిషనర్ వాడకం వల్ల అందులోని సెట్రియమోనియం క్లోరైడ్ వంటివి ఐరనింగ్ వల్ల వచ్చే డ్యామేజ్‌ని నిరోధిస్తాయి.
- హెయిర్ స్ట్రెయిటనింగ్ చేసే ముందు జుట్టు దెబ్బతినకుండా నాణ్యమైన హీట్ ప్రొటక్షన్ స్ప్రే వాడాలి.
- జుట్టు ఐరనింగ్ కోసం సిలికాన్ పూత పూసిన ఐరనింగ్ టూల్స్ మాత్రమే వాడాలి. దీనివల్ల వేడి ప్రభావం జుట్టు మీద ఎక్కువగా పడకుండా చూసుకోవచ్చు.
- స్టయిలింగ్ పేరుతో అతిగా జెల్స్, మ్యూట్లు వాడటం మంచిది కాదు. అలాగే కొన్ని రకాల ల్యూబ్రికెంట్లూ నేరుగా చర్మం ద్వారా రక్తంలో కలిసి క్యాన్సర్లూ, అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- బ్లో డ్రయ్యర్ వాడటం ద్వారా జుట్టు చిక్కు పడకుండా స్ట్రెయిట్ గా వస్తుంది.