• HOME
 • అందం
 • నడివయసులోనూ మెరిసే చర్మానికి చిట్కాలు

   అందంగా ఆరోగ్యంగా కనిపించాలని అందరూ అనుకొంటారు. కానీ నడివయసు నాటికి చర్మం ముడతలు పడటం మొదలై క్రమంగా కాంతిని కోల్పోవటం మొదలవుతుంది. అయితే కొన్ని చిట్కాలు పాటించటం ద్వారా నడివయసులోనూ మెరిసే చర్మాన్ని పొందటం సాధ్యమని నిపుణులు సూచిస్తున్నారు. అవి

 • శారీరక సమస్యలున్నవారు మినహా అందరూ రోజుకు కనీసం 10 గ్లాసుల నీరు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్ ముప్పు ఉండదు. అలసట కూడా దూరమై వయసు ప్రభావం కనిపించదు.
 • రోజూ ఓ గ్లాసు కొబ్బరినీళ్లు తాగితే శరీరంలోని మలినాలు వదిలిపోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది.
 • ఆహారంలో తగినన్ని కార్బోహైడ్రేడ్లు, ఖనిజ లవణాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్లు వంటివి అందుతున్నాయా లేదా అని గమనించుకోవాలి. రోజువారీ ఆహారంలో మాంసం, గుడ్లు, చేపలు, ఆకుకూరలు, కూరగాయలు, పప్పుదినుసులు, తృణ ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో అవసరానికి మించి తినటం మానుకోవాలి.
 • వయసు త్వరగా దరి చేరకుండా కాపాడుకోవడానికి విటమిన్‌ డి ముఖ్యం. రోజూ కనీసం అరగంట పాటైనా ఒంటికి ఎండ తగిలితే శరీరానికి అవసరమైనంత విటమిన్ డి లభిస్తుంది. దీనివల్ల చర్మం ముడుతలు పడదు. చర్మక్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది.
 • తీవ్రంగా అలసిపోవడం అంటే.. వయసును వేగంగా ఆహ్వానించడమే. కనుక రోజూ కంటినిండా నిద్ర, పని వేళల్లో తగిన విశ్రాంతి ఉండేలా చూసుకోవాలి.
 • వారానికోసారి గోరువెచ్చని సుగంధ నూనె తో శిరస్సు నుంచి అరికాళ్ల వరకు మర్దన చేయించుకుంటే.. రక్తప్రసరణ మెరుగుపడి అవయవాలకు కావాల్సినంత ప్రాణవాయువు అందుతుంది. దీనివల్ల వయసు ప్రభావం కనిపించదు.
 • వయసు మీద పడకుండా చేయటంలో వ్యాయామం ఎంతో కీలకమైనది. నడక, ఇంటిపని, తోటపని, ఆటల కోసం రోజుకు గంట సమయమైనా కేటాయించుకోవాలి.
 • ధూమపానం, మద్యపానం చర్మ శోభను దెబ్బతీస్తాయి గనుక వాటికి దూరంగా ఉండాలి.
 • చివరగా.. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధమైన జీవనశైలిని అలవరచుకొని లేనిపోని ఆరాటాలకు దూరంగా హాయిగా జీవించేవారు నిత్యా యవ్వనులుగా కనిపిస్తారు.

ముఖ చర్మకాంతిని పెంచే చిట్కా

ఫ్రిజ్‌లో పెట్టిన చల్లని చిక్కని పచ్చిపాలలో మెత్తని పొడి బట్టను 2 నిమిషాలు ముంచి పిండి నీటితో శుభ్రం చేసుకున్న ముఖం మీద పరచి 10 నిమిషాలు ఉంచాలి. రోజూ ఈ చిట్కాను పాటించటం వల్ల ముఖచర్మం లోలోతుల్లోని మలినాలు వదిలిపోయి చర్మం కొత్త కాంతితో మెరవటమే గాక సున్నితంగా, బిగుతుగాను మారుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE