రంగుల పండుగ హోలీ ! మనదేశంలో ఆబాలగోపాలం ఆనందంతో చేసుకునే వేడుక ఇది. సహజ సిద్దమైన, పర్యావరణ హితమైన రంగులు చల్లుకుంటూ చేసుకునే ఈ వేడుక ఇటీవలి కాలంలో  పలు మార్పులకు గురవుతోంది . హోలీ రంగుల్లో రసాయనాలు, పారిశ్రామిక వ్యర్ధాలు కలిపి అమ్ముతున్న పరిస్థితి. తెలియక ఈ రంగులు కొని చల్లు కోవటం వల్ల పలు చర్మ సమస్యలతో బాటు కంటి చూపు సమస్యలూ వచ్చే ప్రమాదం ఉంది. కృత్రిమ రంగుల స్థానంలో  సహజ సిద్దమైన రంగులను వాడటమే ఈ సమస్యకున్న ఏకైక పరిష్కారం. 

ఇంట్లోనే రంగుల తయారీ

 • ఆకుకూరలను పేస్ట్ చేసి దాన్ని నీటిలో కలిపితే  ఆకు పచ్చ రంగు  నీరు రెడీ అయినట్టే.
 • ఎర్ర చందనం పొడిని హోలీ రంగుగా వాడొచ్చు. దాన్ని నీటిలో మరిగిస్తే ఎర్ర రంగు నీళ్ళు సిద్దమైనట్లే.
 • పసుపు, శనగపిండి కలిపితే నిండు పసుపు రంగు కూడా ఉన్నట్టే.
 • గోరింటాకు పొడి నీటిలో కలిపి నారింజ రంగు చేసుకోవచ్చు.
 • గోరింటాకు పొడి, ఉసిరి కాయ పొడిని నీటిలో కలిపితే ముదురు గోధుమరంగు వస్తుంది.  
 • మందార పూల గుజ్జును నీటిలో కలుపుకుంటే యెర్ర రంగు హోలీకి సిద్దమైనట్లే.
 • బంతి, చామంతి పూలను రాత్రంతా నీటిలో నానబెడితే లేత పసుపు రంగు వస్తుంది.

పాటించాల్సిన జాగ్రత్తలు

 • హోలీకి ముందు రోజుల్లో ఫేషియల్స్ చేయించుకోవద్దు.
 • హోలీ ఆడేందుకు వెళ్ళే ముందు ముఖం, చేతులు, కాళ్ళు, మెడ భాగాలకు ఆయిల్, పెట్రోలియం జెల్లీ వంటివి రాసుకుంటే రంగుల ప్రభావాన్ని నిరోధించవచ్చు.
 • రంగుల ప్రభావం జుట్టు మీద పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా నూనె రాయాల్సిందే.
 • వీలున్నంత మేర ఒంటిని పూర్తిగా కప్పే వస్త్రాలను ధరిస్తే రంగుల ప్రభావం నుంచి కాపాడుకోవచ్చు.
 • రంగులు పూసుకున్న తర్వాత నీడలో తప్ప ఎండలో కూర్చోకూడదు.  
 • తలపై అంటుకున్న రంగులను షాంపూ. సబ్బుల సాయంతో పూర్తిగా పోయేవరకు కడిగి ఒళ్ళంతా  మాయిశ్చరైజెర్ రాసుకోవాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE