గాయాల వల్ల శరీరానికి కలిగే అనుభూతినే నొప్పి అంటాం. దెబ్బతిన్న శరీరభాగం కోలుకునేందుకు శరీరం ఏర్పాటు చేసుకున్న రక్షణ వ్యవస్థలో నొప్పి కూడా ఓ భాగమే. ఒంట్లో తలెత్తిన అనారోగ్యాన్ని ముందుగా గుర్తించి ముందుగా సూచన చేస్తుంది. ప్రమాదాల కారణంగా అయ్యే గాయాల మొదలు వయసు పైబడిన వారిలో కనిపించే వెన్ను, మెడ నొప్పుల వరకూ పలు రకాలున్నాయి. కారణాలేమైనా ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు సత్వరం తగిన చికిత్స తీసుకోవటంతో బాటు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా చూసుకోవటం ఎంతైనా అవసరం. నొప్పి విషయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యాంశాలు...

 • చికిత్స కంటే కూడా నివారణే మేలు అనే సూత్రం నొప్పి విషయంలోనూ వర్తిస్తుంది. అందుకే వయసుతో బాటు వచ్చే మార్పులను గమనించుకుంటూ సాగాలి.
 • వయసు మీద పడిన వారిలో కనిపించే శాశ్వత నొప్పులను పూర్తిగా తొలగించటం సాధ్యం కాకున్నా ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటి సాధనలు ఎంతో కొంత ఉపసమనాన్ని కలిగిస్తాయి.
 • సంగీతం, తోటపని, పెంపుడు జంతువుల ఆలనా పాలనా చూడటం వంటి వ్యాపకాలవల్ల మానసిక ఒత్తిళ్ళు దూరమై పలు రకాల నొప్పులు ఉపశమిస్తాయి.
 • ఇష్టమైన వ్యక్తులతో గడపటం, ఆహ్లాదకరమైన సన్నివేశాలను ఊహించుకోవటం వాళ్ళ కూడా నొప్పుల బాధ తగ్గుతుంది.
 • నొప్పిని భౌతిక భావనగా గాక మానసిక భావనగా అనుకున్నా మేలైన ఫలితాలుంటాయి.
 • నొప్పులతో బాధ పడేవారు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరుచుకోవటం ఎంతైనా అవసరం.
 • ఎప్పుడూ ఏ పనీ చేయకుండా కూర్చోవటమో, పదోకోవటానికి బదులుగా తేలిక పాటి వ్యాయామం, లిఫ్ట్ కు బదులు మెట్లు ఎక్కటం, సాయంత్రాలు వ్యాహ్యాళికి వెళ్ళటం వాటి వ్యాపకాలు నొప్పులను తగ్గిస్తాయి.
 • నీడపట్టున ఉండి పని చేసే వారు, కంప్యూటర్ మీద రోజంతా పనిచేసే వారు అరగంటకో మారు అటూ ఇటూ నాలుగడుగులు వేయగలిగితే నొప్పుల బెడద ఉండదు.

ఇతర జాగ్రత్తలు

 • అనారోగ్యాల బారిన పడిన వారు వైద్యుల సలహా మేరకే వ్యాయామాలు చేయాలి.
 • ధూమపానం, మద్యపానం నొప్పులను పెంచేందుకు దోహద పడతాయి గనుక వాటికి దూరంగా ఉండాలి.
 • బిగదీసుకుని కూర్చోటానికి బదులుగా సౌకర్యవంతంగా కూర్చోవాలి.
 • మరీ మెత్తని పరుపు కంటే కాస్త గట్టిగా ఉండే వాటిమీదే పడుకోవాటంతో బాటు సరైన భంగిమలో పడుకోవటం అలవర్చుకోవాలి.
 • బరువులు లేపెతప్పుడు నడుము పూర్తిగా వంచకుండా, మోకాళ్ళు వంచి లేపాలి.
 • ఊబకాయం వంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి.
 • పరిమితంగా తీసుకునే కాఫీ నొప్పులను తగ్గిస్తుంది.
 • హాట్ పాక్స్ సాయంతో కాపడం పెట్టుకోవటం, మసాజ్ వంటివి కూడా నొప్పులను తగ్గిస్తాయి.
 • అవసరాన్ని బట్టి మెడ, నడుము మీద వత్తిడి పడకుండా చూసే బెల్టులను వాడాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE