నాడీ వ్యవస్థలో వచ్చే అసాధారణ మార్పుల మూలంగా మూర్ఛ వ్యాధి వస్తుంది. ఇది ఏ వయసువారికైనా రావచ్చు. కనీసం రెండు, మూడు సార్లు మూర్ఛ వస్తేనే దాన్ని మూర్ఛవ్యాధి లేదా ఎపిలెప్సీగా పరిగణిస్తారు. అధిక జ్వరం, జన్మతః సంక్రమించే లోపాలు, మెదడులోని కణుతులు, పలు ఇన్ఫెక్షన్లు, తలకు తీవ్రమైన గాయాలవటం, మరిగే నీళ్ళతో తలస్నానం చేయడం, మితిమీరిన మద్యపానం, నిద్రలేమి వంటి పలు కారణాల వల్ల ఈ సమస్య రావచ్చు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించిన ఈ రోజుల్లోనూ ఈ వ్యాధిపై పలు అపోహలు రాజ్యమేలుతున్నాయి. మూర్చ వ్యాధికి సంబంధించిన కొన్ని అఫలు,వాస్తవాల గురించి తెలుసుకుందాం.
అపోహ: మూర్చ అంటువ్యాధి.
వాస్తవం: స్పర్శ, నీరు, గాలి, ఆహారం నీరు వంటి వాటి మూలంగా మూర్చ ఒకరినుంచి మరొకరికి సంక్రమించదు.
అపోహ: మూర్చ వచ్చినప్పుడు బాధితుడిని కదలకుండా పట్టుకోవాలి.
వాస్తవం: వేగంగా కదలటం వల్ల తల, కాళ్ళు వంటివి గాయపడే ప్రమాదం ఉన్నందున బాధితుడి కదలికలను బట్టి తలకింద దిండు ఉంచటం, పదునైన వస్తువులను దూరంగా ఉంచటం చేస్తారు తప్ప బాధితుడిని అసలేమాత్రం కదలకుండా చేయటం సరికాదు.
అపోహ: మూర్ఛ వ్యాధి పుట్టుకతోనే వస్తుంది
వాస్తవం: ఇది పూర్తిగా అపోహే. బాల్యం, యవ్వనం, నడివాసు నాటికి కూడా ఈ సమస్య కనబడే ప్రమాదం ఉంది.
అపోహ: తెలివితక్కువ వారికే మూర్చలు వస్తాయి.
వాస్తవం: ఇది పూర్తిగా శారీరక సమస్యే తప్ప మానసిక సమస్య కానే కాదు. సోక్రటీస్ మొదలు ఐజాక్ న్యూటన్ వరకు ఎందరో అసమాన ప్రతిభావంతులంతా ఏదో ఒక సమయంలో దీని బారిన పడిన వారే .
అపోహ : దైవానుగ్రహం ఉన్నవారికే మూర్చలు వస్తాయి.
వాస్తవం: ఇది పూర్తిగా అపోహ మాత్రమే.
మెదడులో సమతుల్యత దెబ్బతినడం వల్ల తీవ్రంగా మూర్ఛ వచ్చి బాధితులు పిచ్చివారిలా ప్రవర్తిస్తారు తప్ప మానవాతీత శక్తుల ప్రభావం వల్ల మాత్రం కాదు.
అపోహ: మూర్చ వంశ ప్రతిష్టకు కళంకం తెచ్చే జబ్బు.
వాస్తవం: ఇలా అపోహ పడటం వల్లే ఇప్పటికీ చాలామంది తమకు, తమ పిల్లలకు ఈ సమస్య ఉన్నట్లు చెప్పుకోరు. ఇది పూర్తిగా నివారించదగిన, చికిత్స అందుబాటులో ఉన్న ఓ సాధారణ అనారోగ్యమే తప్ప మరోటి కాదు గనుక అలా అనుకోవాల్సిన పనిలేదు.
చెయ్యకూడనివి...