ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యం మీద తగిన సమయం కేటాయిస్తున్నారు. ఇది శుభపరిణామం. అయితే ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు. శరీరంతో బాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ వ్యక్తి అయినా సంపూర్ణ ఆరోగ్యవంతుడుగా ఉండగలుగుతాడు.  పలు రకాల మానసిక ఒత్తిళ్ళు, అతని ఆలోచనా విధానం,  ఆయా విషయాల మీద అతనికి ఉండే  దృక్పథం, ఉద్వేగాలు, ప్రవర్తన అనే  నాలుగు అంశాలమీద మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.

లక్షణాలు

 • ఎప్పుడూ ఇతరుల అభిప్రాయాలతో విభేదించటం, అవమానించటం, దాడికి దిగటం చేస్తుంటారు.
 • అనుకున్న పని కాకపొతే ఆత్మహత్య గురించి ఆలోచన చేస్తారు.
 • ఇతరుల పట్ల అకారణమైన ద్వేషం, విసుగు కనబరుస్తారు.
 • భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సంబంధించిన భ్రమలు, భ్రాంతులతో కాలం గడుపుతారు.
 • ఎప్పుడూ తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నిద్రలేమి, మలబద్ధకం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతుంటారు.
 • నలుగురిలో కలవలేరు. తమపట్ల తామే జాలిపడుతుంటారు.
 • కూడని పనులు చేయటం, దుర్వ్యసనాలపట్ల మొగ్గుచూపుతుంటారు.
 • అప్పగించిన పనిని వదిలిపెట్టి తిరగటం, కుటుంబీకులతో కూడా పట్టనట్లుగా వుంటారు.

కారణాలు

మానసిక సమస్యలకు కారణాన్ని ఒకపట్టాన తేల్చలేము. మనిషుకుండే పలు  బలహీనతలు, సమస్యలు, రోగాల  వంటి పలు అంశాల సమష్టి ప్రభావం మూలంగా ఈ మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. శారీరక, జన్యుపర, వంశానుగత అంశాలతో బాటు పెరిగిన వాతావరణం, కుటుంబ పరిస్థితులు, చెడు స్నేహాలు కూడా సంస్యకున్న ఇతర కారణాలుగా ఉంటాయి. కొందరిలో తలకు బలమైన గాయాలు కావడం, నాడీ వ్యవస్థలో తలెత్తే లోపాలు కూడా సమస్యలకు కారణం కావచ్చు. సరైన వ్యక్తిత్వం, మంచి అలవాట్లు, ఉన్నతమైన విలువలు, సానుకూల ఆలోచనలున్న వారు సులభంగా తమలో తలెత్తే మానసిక సమస్యలను గుర్తించి, వాటిని అధిగమించగలరు.

ఈ మార్పులతో మానసిక సమస్యలకు చెక్ 

 • అన్ని రకాల మానవ సంబంధాల (కుటుంబ, స్నేహ, సామాజిక)కు విలువివ్వటం
 • చిన్న చిన్న సమస్యలున్నా లేనిపోని పట్టింపులకు పోక సర్దుకుపోవటం 
 • కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయటం
 • తనమీద తనకు నమ్మకం, సాధించిన దానిపట్ల సంతృప్తి, తోటి వారిపట్ల ప్రేమ,ఆదరణ కలిగి ఉండటం
 • సమస్యలను నేర్పుగా, ఓర్పుగా పరిష్కరించుకోవటం, సరైన నిర్ణయాలు తీసుకోవటం
 • ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం, ఉన్నదాన్ని తోటి వారితో పంచుకోవటం
 • కష్టపడి పనిచేయటం, పనికి సృజనాత్మకత జోడించటం 
 • అర్హత లేనిదాన్ని ఆశించక పోవటం, క్రమశిక్షణకు విలువివ్వటం, నమ్మిన విలువల కోసం నిలబడటం
 • ఫలితం గురించి ఆలోచించక అప్పగించిన బాధ్యతలను మోసేందుకు సిద్ధపడటంRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE