• HOME
 • ఆరోగ్యం
 • గర్భనిరోధక మాత్రల వినియోగం.. జాగ్రత్తలు      

    అభివృద్ధి చెందిన దేశాల్లో నవ దంపతులకు గర్భధారణకు సంబంధించిన కౌన్సెలింగ్ ను  ప్రభుత్వమే తప్పనిసరిగా ఇస్తుంది. ఎంత కాలం తర్వాత బిడ్డను కనాలనుకుంటున్నారు?  ఒకరితో సరిపెట్టుకోవాలనుకున్తున్నారా లేక ఇద్దరా? ఆరోగ్య సమస్యలున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కొంతకాలం పిల్లలు వద్దనుకునేవారు ఎలాంటి జాగ్రత్తల పాటించాలి? వంటి పలు అంశాల ఆధారంగా సురక్షితమైన విధానాల గురించి  దంపతులకు ముందుగానే అవగాహన కలిపిస్తారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ పద్దతిని పాటిస్తున్నారు.

వివాహం తర్వాత వెంటనే పిల్లలు వద్దనుకునే వారు , అవాంచిత గర్భం భయంతో యువతులు గర్భని రోధక మాత్రలు  తోచిన తీరుగా వాడుతున్నారు. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన పోకడ. కొందరిలో ఈ  మాత్రల వినియోగం ఇతర అనారోగ్యాలకూ దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే ఈ మాత్రలు వాడదలచిన వారు బిడియపడకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.  తాత్కాలికంగా గర్భధారణను వాయిదా వేసే వారికి గర్భనిరోధక మాత్రలతో పాటు కండోమ్స్‌ వాడకం, హార్మోన్‌ ఇంజెక్షన్లు, లూప్  కాంట్రసెప్ట్‌ డివెైజ్‌లు ప్రత్యామ్నాయాలు ఉన్నందున వైద్యుల సలహాతో సురక్షితమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవచ్చు.

ఎవరు తీసుకోవచ్చు?

పిల్లలు వద్దనుకున్న  18 నుంచి 40 ఏళ్ళ మధ్య వయసు మహిళలు ఈ మాత్రలు వాడొచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు వాడొచ్చు. అయిదేళ్లకు పైబడి కొనసాగించాల్సి వస్తే తప్పక డాక్టర్ల సలహా తీసుకోవాలి.

బాలింతలు..మాత్రల వినియోగం

 పాలిచ్చే బాలింతలు 6 నెలల తర్వాత,  పాలివ్వని బాలింతలు  మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్రలు   వాడుతు న్నప్పుడు మధ్యమధ్యలో వైద్యుల చేత  చెకప్‌ చేయించుకోవాలి. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వీటిని ఉచితంగా  అందిస్తున్నారు.  

ఉపయోగాలు...

 • అవాంఛిత గర్భాన్ని నివారించవచ్చు. తాత్కాలికంగా పిల్లలు వద్దనుకునే దంపతులు వీటిని వాడొచ్చు.
 • నిరక్షరాస్యులు సైతం కొద్దిపాటి అవగాహనతో వీటిని వాడొచ్చు. అన్ని మందుల షాపుల్లోనూ లభిస్తాయి.
 • ప్రెగ్నెన్నీ ప్లానింగ్‌తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు.
 • ఈ మాత్రల సక్సెస్‌ రేట్‌ చాలా ఎక్కువ గనుక గర్భధారణ గురించిన మానసిక ఒత్తిడి ఉండదు.
 • నెలసరి కడుపునొప్పితో బాధపడేవారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి.
 • ఈ మాత్రల వినియోగంతో గర్భాశయ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
 • ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ(ఫలదీకరణం చెందిన అండం అండ వాహికలోనే పెరగటం) నివారణకు ఉపయోగపడతాయి.

ఎవరు వాడకూడదు?

 • ఈ కింది సమస్యలున్న వారు గర్భనిరోధక మాత్రలు వాడకూడదు.
 • హృదయ సంబంధిత సమస్యలున్నవారు, అధిక రక్తపోటున్న వారు , మధుమేహులు
 • కాలే య సమస్యలు, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితులు
 • రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు
 • 40 ఏళ్ళు పైబడిన, ధూమపానం చేసే మహిళలు,

ప్రతికూల ప్రభావాలు

గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల ఈ కింది ప్రతికూల ప్రభావాలు ఎదురు కావచ్చు. అలాంటి సందర్భాల్లో వెంటనే వైద్య సలహా కోరాలి.

 • కొంత మందికి తలనొప్పిరావచ్చు.
 • మరికొందరు బరువు పెరుగుతారు.
 • ఇంకొందరిలో రక్తనాళాల్లో రక్తంగడ్డ కట్టుకుపోతుంది.
 • కొందరికి కడుపులో తిప్పిన ట్టుగా, వాంతి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది.
 • మరికొందరిలో గ్యాస్‌ ప్రాబ్లమ్‌ మాదిరిగా పొట్ట ఉబ్బినట్టు అనిపించొచ్చు. 
 • కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్ అవుతుంది.
 • కొందరికి వెజెనల్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు.
 • టిబి బాధితులు వాడితే ఇతర సమస్యలు రావచ్చు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE