ఎండాకాలంలో ఉక్కపోత, వేడిమి కారణంగా చర్మం పేలి చెమటకాయలు రావటం సహజమే. చెమట కాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి  దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువ.  సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే  చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం చర్మం చిట్లి  రక్తం కారడం జరుగుతుంది. అయితే తగు జాగ్రత్తలతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 

  • తాజా కలబంద గుజ్జులోని యాంటీ ఇన్ఫ్లెమేటరీ గుణాల్ వల్ల చెమట కాయల బెడద త్వరగా ఉపశమిస్తుంది.
  • వేసవిలో తప్పనిసరిగా వదులుగా, సౌకర్యంగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. పరుపుల మీద మెత్తని దుప్పట్లు వేసుకుంటే చెమట పట్టినా వెంటనే పీల్చుకుంటాయి.
  • శరీరాన్ని వీలున్నంత మేర చల్లగా ఉంచుకోవాలి. తగినంత నీరు తాగటం, బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం.
  • చెమట కాయలున్నచోట గోకటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. చెమట కాయలున్న చోట మూడింతల నీటికి ఒక వంతు వెనిగర్ కలిపి  ఆ నీటిలో ముంచిన మెత్తని బట్టతో చెమట కాయలున్న చోట తుడిస్తే దురద తగ్గుతుంది. వెనిగర్ కు బదులుగా బేకింగ్ సోడా కూడా వాడొచ్చు.
  • అప్పటికప్పుడు తీసినతీసిన గంధం చెమట కాయలున్న చోట రాయటం వల్ల చర్మంలో తగినంత తేమ నిలిచి దురద పెట్టటం ఆగిపోతుంది.
  • గంధం చక్కని యాంటీ సెప్టిక్ మాదిరిగా పనిచేసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కొంచెం గంధం పొడిలో తగినంత రోజ్ వాటర్ కలిపి చెమటకాయలున్న చోట రాసి ఆరిన తర్వాత కడిగేస్తే మళ్ళీ సమస్య రాదు.
  • ఆముదంలో యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాస్త దూదిమీద రెండుమూడు చుక్కల ఆముదం వేసి  చెమటకాయలు  ఉన్న చోట నెమ్మదిగా రాస్తే సమస్య ఉపశమిస్తుంది.
  • చెమటకాయలు, దురద తీవ్రంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా చర్మ వ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE