గర్భాశయంలో ఏర్పడే కణితిని ఫైబ్రాయిడ్‌‌ అంటారు. సంతానలేమికి గల కారణాల్లో ఇదీ ఒకటి. రజస్వల అయినప్పటినుంచి తిరిగి మెనోపాజ్ దశవరకూ ఎప్పుడైనా ఇవి ఏర్పడే అవకాశం ఉంది. ఫైబ్రాయిడ్స్ ఎక్కువగా 30 నుంచి 45 ఏళ్ళ మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయి. 15 ఏళ్ళ లోపు, 50కి పైబడిన వారిలో ఇవి కనిపించటం బహు అరుదు. 

కారణాలుగర్భాశయంలోని కండరాలు పెరగడం వల్ల కణితి గా పరిణామం చెందటం వల్ల సమస్య మొదలవుతుంది. దీనికి స్పష్టమైన కారణాలు ఏమిటో ఇప్పటికీ తెలియదు. అయితే  జన్యు పరమైన కారణాలు, హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు సమస్యకు ప్రధాన కారణమనేది డాక్టర్ల భావన. పదేళ్ళకే రజస్వల అయినవారిలో, పిల్లలు లేని మహిళల్లో ఈ సమస్య కాస్త అధికమేనని చెప్పాలి.

 

ఫైబ్రాయిడ్‌‌ పెరిగే కొద్దీ గర్భాశయ పరిమాణం కూడా పెరుగుతుంది. గర్భసంచి మధ్య పొరల్లో, గర్భసంచి లోపలి పొరల్లో, పై పొరల్లో ఇవి ఏర్పడుతుంటాయి. గర్భాశయం కండరంలో తయారయ్యే కణితి బయటి వైపు పెరిగితే పరవాలేదుగానీ కండరం లోపలే ఉంటే నెలసరి అధిక రక్తస్రావం, రక్తస్రావం ఎక్కువ  రోజులు కొనసాగడం వంటి సమస్యలు కొందరిలో కణితి గర్భాశయం నుంచి వెలుపలికి రావటం వల్ల  రక్తస్రావం, గర్భస్రావాలకు కారణమవుతుంది. ఒక్కోసారి గర్భం రాకుండా అడ్డుపడటానికి కారణం కావచ్చు.

 లక్షణాలు :  ప్రత్యేకంగా పరీక్షలు చేసినప్పుడు తప్ప ఈ కణితులున్నట్లు తెలియదు. సమస్య ఉన్నప్పటికీ చాలామంది మహిళలలో ఎటువంటి ప్రత్యేక లక్షణాలు కనిపించవు. కొందరిలో ఈ కణితులు ఉన్నా, కొంతకాలానికి వాటంతట అవే కరిగిపోతాయి. మరికొందరిలో మాత్రం అలాజరగాకపోగా  గర్భసంచి సైజు పెరగటం, పొత్తి కడుపు భాగమంతా భారంగా అనిపించటం, రక్త హీనత, కణుతులు పెరిగేకొద్దీ అరుగుదల తగ్గటం, నీరసం, సంతానలేమి, అబార్షన్‌ కావటం, నెలలు నిండక ముందే కాన్పు కావటం, నెలసరిలో అధిక రక్తస్రావం,  నెలసరి మధ్యలో రక్తస్రావం, మూత్రాశయం, పేగు లపై ఒత్తిడి పెరిగి మూత్ర విసర్జన సాఫీగా జరగక మూత్రపిండాల పనితీరు దెబ్బతినటం, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. అల్ట్రా సౌండ్‌ స్కాన్‌, ల్యాప్రో స్కోపి, హిస్టిరోస్కోపీ పరీక్షల ద్వారా వీటి ఉనికిని స్పష్టంగా గుర్తించవచ్చు.

   చికిత్స :  ఫైబ్రాయిడ్‌ ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం లేదు గానీ దాని వల్ల ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మాత్రం  సర్జరీ అవసరమవుతుంది. తొలిదశలో రోగికి కౌన్సిలింగ్‌ ద్వారా సమస్యపై అవగాహన కల్పించి, తగ్గేందుకు మందులు సూచిస్తారు. రక్తస్రావం కారణంగా శరీరంలో రక్త శాతం తగ్గిపోతుంది గనుక రక్తం వృద్ధి చెందడానికి, రక్త స్రావం ఆగిపోవడానికీ మందులిస్తారు.  మందుల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే సర్జరీ వంటి ప్రత్యామ్నాయాలను సూచిస్తారు.

జాగ్రత్తలు :  మంచి పోషకాహారం తీసువటం ద్వారా రక్తహీనత బారిన పడకుండా చూసుకోవటం, తగినంత వ్యాయామం చేయటం, గర్భవతులు తగినంత విశ్రాంతి తీసుకోవటం, ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకోవటం ద్వారా సమస్యను అదుపు చేయవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE