అసురక్షిత లైంగిక సంబంధాల మూలంగా సంక్రమించే వ్యాధులను సుఖవ్యాధులు అంటారు. యాంటీబయోటిక్స్ అందుబాటులో లేని రోజుల్లో సిఫిలిస్‌, గనేరియా వంటి సుఖవ్యాధులు మానవాళిని భయంకరంగా కబళించాయి. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్‌ల  రూపంలో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. అయితే ఆ తరువాతి రోజుల్లో వైద్య విజ్ఞానం విస్తరించే కొద్దీ ఈ తరహా వ్యాధులు అదుపులోకి వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 14-25 ఏళ్ళ మధ్య వయస్కులు ఏదో ఒక సుఖవ్యాధి బాధితులేనని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన సమయంలో వీటిని గుర్తించి చికిత్స తీసుకోకపోతే  ఇవి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ... చివరికి ఓ విష వలయంలా,  తయారవుతాయి. సురక్షిత  లైంగిక పద్ధతుల గురించి సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయటమే ఈ సమస్యకు అత్యుత్తమ పరిష్కారం. 

 

అయితే ఆధునిక యుగంలో ఆశ్చర్యకరమైన రీతిలో  వైరస్‌ల ద్వారా వ్యాపించే సుఖవ్యాధులు విపరీతంగా ప్రబలిపోతున్నాయి. వీటి నియంత్రణ, చికిత్స కూడా కష్టసాధ్యమైన విషయంగా మారుతోంది. మరోవైపు ఒకప్ఫుడు యాంటీబయోటిక్స్ కు సులభంగా లొంగిన సుఖవ్యాధులు ఇప్ఫుడు మొండిగా తయారవుతున్నాయి. అయితే చికిత్స కంటే ఈ  సుఖవ్యాధుల నివారణ  సులభమైన విషయం. సిఫిలిస్‌ మొదలు హెచ్‌ఐవీ ఇప్ఫుడు మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.

గుర్తుంచుకోవాల్సిన అంశాలు 

  • సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు.
  • చూడటానికి బాగున్నంత మాత్రాన సుఖ వ్యాధులు లేవని అనుకోరాదు. లక్షణలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది.
  • సుఖవ్యాధులున్న వారికి హెచ్‌ఐవీ సోకే అవకాశాలు చాలా ఎక్కువ.
  • శరీర నిర్మాణపరమైన తేడాల వల్ల పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలకు సుఖవ్యాధుల ముప్పు ఎక్కువ. సుఖ వ్యాధుల వల్ల మహిళలు తీవ్రమైన పొత్తికడుపు నొప్ఫి, సంతాన లేమి, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ వంటి సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. తల్లి నుంచి బిడ్డకు కూడా సోకే ప్రమాదం ఉంది.
  • ఈ నేపథ్యంలో అపరిచితులతో శృంగారానికి దూరంగా ఉండటం, ఒకవేళ శృంగారంలో పాల్గొనాల్సి వస్తే విధిగా కండోమ్‌ వినియోగం, భార్యాభర్తల్లో ఏ ఒక్కరికైనా  జననాంగాల వద్ద ఇబ్బందిగా అనిపించినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించటం మేలు. మందులు కూడా పూర్తికాలం వేసుకోవాలి.
  • సుఖవ్యాధి సోకినప్పుడు దంపతులిద్దరూ చికిత్స తీసుకుంటేనే సమస్య మళ్ళీ రాకుండా చూడొచ్చు. నలుగురికీ తెలుస్తుందని భయపడి నాటువైద్యులను ఆశ్రయించటం మంచిది కాదు.
  • అవాంఛిత గర్భం, సుఖ వ్యాధుల నివారణకు కండోంను మించిన ప్రత్యామ్నాయం లేదు.
  • ఎదిగే వయసు పిల్లలకు సురక్షిత శృంగార పద్ధతుల గురించి, వివరించటం చాలా అవసరం. హెపటైటిస్‌-బి, హెపీవీ వంటివి సంక్రమించకుండా ఇప్ఫుడు టీకాలు వైద్యుల సలహా మేరకు వీటిని యుక్తవయస్కులకు ఇప్ఫించటం అన్ని విధాలా శ్రేయస్కరం.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE