ఏ డాక్టరు దగ్గరకు వెళ్లినా ముందుగా బరువు చెక్ చేస్తుంటారు. వైద్యులు చాలామందికి ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా వున్నావనో లేక తక్కువ ఉన్నట్లో  చెబుతుంటారు. ఆరోగ్యంగా ఉండటంలో ఎత్తుకు తగ్గ బరువు కూడా ఒక అంశమే. దీనిని తెలిపే  ప్రమాణమే బీఎమ్ఐ( బాడీ మాస్ ఇండెక్స్). నిర్ణీత ఎత్తుకు యెంత బరువుండాలో చెప్పే ఈ ప్రమాణం ఆధారంగా ఒక వ్యక్తి తక్కువ బరువున్నాడా? లేక సాధారణ బరువున్నాడా అని నిర్ణయిస్తారు. అధిక బరువు, స్థూలకాయం వంటి అంశాలూ ఈ విలువ ఆధారంగానే నిర్ణయిస్తారు. 

బీఎంఐ = బరువు (కిలోలలో)/ఎత్తు (మీటర్లలో)2 

బరువు విభజన ఇలా... 

బీఎంఐ                                            ఫలితం

18.5 లేదా తక్కువ                      తక్కువ బరువు

18.5-24.9                                      సాధారణం

25.0-29.9                                    అధిక బరువు

30.0-34.9                                 స్థూలకాయం ఆరంభ దశ

35.0-39.9                                 పూర్తిస్థాయి స్థూలకాయం

40 నుండి                            ప్రమాదకర  స్థూలకాయం



Recent Stories







bpositivetelugu

దీపావళి టపాసులతో జర భద్రం

 పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఉత్సాహంగా జరుపుకునే పండుగ దీపావళి. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటకాలు 

MORE
bpositivetelugu

నరక చతుర్దశి పుణ్య విధులు

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశిగా జరుపుకొంటాము. ఇది నరకలోకవాసులకు 

MORE