శిశువుకు తల్లిపాలను మించిన ఆహరం మరొకటి లేదు. నిజానికి ఇవి అమృతంతో సమానం.  బిడ్డకు అవసరమయ్యే సమస్త పోషకాలూ చనుబాలలో ఉండటమేగాక సులభంగా కూడా జీర్ణం అవుతాయి. అటు తల్లి ఆరోగ్యం దృష్ట్యా కూడా చనుబాలివ్వటం చాలా మంచిది. అయితే చనుబాల విషయంలో ఇప్పటికీ పలు అపోహలు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో చనుబాలకు సంబంధించిన కొన్ని అపోహలు, అసలు వాస్తవాలు తెలుసుకుందాం.

అపోహ: బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లికి నొప్పి కలుగుతుంది.

వాస్తవం: కాన్పు అయిన తొలిరోజుల్లో తేలికపాటి నొప్పి ఉండటం సహజమే. అయితే రోజులు గడిచే కొద్దీ సమస్య తీరుతుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నా లేక  వారానికి మించి కొనసాగితే వైద్యుల సలహా కోరాలి.

 

అపోహ: కాన్పు అయిన తర్వాత 4 రోజుల వరకు సరిపడినన్ని పాలు పడవు.

వాస్తవం: తోలి వారంలో తక్కువ పాలు పడే మాట నిజమే. అయితే అప్పటి బిడ్డ అవసరాలకు అవి చక్కగా సరిపోతాయి.

 

అపోహ: చనుబాలు తాగే పిల్లలకు విడిగా విటమిన్ డి అందించాలి.

వాస్తవం: అలాంటిదేమీ లేదు. బిడ్డకు అవసరమైన సమస్త పోషకాలూ చనుబాల ద్వారా అందుతాయి.

 

అపోహ: వాతావరణం వేడిగా ఉన్నప్పుడు బిడ్డకు అదనంగా నీళ్ళు పట్టించాలి.

వాస్తవం: అవసరం లేదు. బిడ్డకు కావలసినంత నీరు పాల ద్వారానే  అందుతుంది.

 

అపోహ: పాలు పట్టిన ప్రతిసారీ రొమ్మును శుభ్రపరుచుకోవాలి.

వాస్తవం: ఏమాత్రం అవసరం లేదు. తల్లి సాధారణ శుభ్రతను పాటిస్తే చాలు.

 

అపోహ: బిడ్డకు వాంతులు, విరేచనాలు అయితే పాలు పట్టకూడదు.

వాస్తవం: వైద్యులు ప్రత్యేకంగా చెబితే తప్ప పాలివ్వటం ఆపకూడదు. నిజానికి ఇలాంటి బాలారిష్టాలనుంచి కాపాడే ఔషధమే చనుబాలు.

 

అపోహ: తల్లి అనారోగ్యంతో ఉంటే బిడ్డకు పాలివ్వకూడదు.

వాస్తవం: తల్లి చిన్నా చితకా అనారోగ్యాలకు గురైనా, అందుకు సంబంధించిన మందులు వాడుతున్నా నిరభ్యంతరంగా బిడ్డకు పాలివ్వొచ్చు. ఈ విషయంలో అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలి.

 

అపోహ: తల్లి గర్భవతిగా ఉంటే బిడ్డకు పాలివ్వకూడదు.

వాస్తవం: తల్లికి ఇబ్బందిలేనంతవరకు పాలివ్వొచ్చు.

 

అపోహ: సిజేరియన్ కాన్పు బిడ్డలకు అదేరోజు పాలివ్వకూడదు.

వాస్తవం: అలాంటి అనుమానం అవసరం లేదు. సర్జరీ అయిన కాసేపటికే పాలివ్వగలిగితే నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.

అపోహ: పాలిచ్చే తల్లి పథ్యం చేయాలి.

వాస్తవం: తల్లి ఆరోగ్యాన్ని బట్టి సంతులిత ఆహారం తీసుకుంటే చాలు.

 

అపోహ: పాలిచ్చే తల్లి నీరు,  పండ్ల రసాలు, ఇతర పానీయాలు అధికంగా తీసుకోవాలి.

వాస్తవం: దాహాన్ని బట్టి తదితరాలను తీసుకుంటే చాలు. అదనపు జాగ్రత్తలు పనిలేదు.

 

అపోహ: ఒక రోజు బిడ్డకు పాలివ్వకపోతే మరునాటికి పాలు పాడవుతాయి.

వాస్తవం: ఒకటి రెండు రోజులు పాలివ్వకున్నాచనుబాలు పాడుకావు. అవి ఎప్పటికీ తాజాగానే ఉంటాయి గనుక నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE