ఒకప్పుడు వయసు పై బడిన వారికే పరిమితమైన హైబీపీ  సమస్య ఇప్పుడు మూడుపదులలోపే కనిపిస్తోంది. ఆహారంలో ఉప్పు, మసాలాలు అధికంగా తీసుకోవటం, ధూమపానం, మద్యపానం, ఊబకాయం, మానసిక ఒత్తిడితో కూడిన జీవన శైలి వంటి కారణాలతో బాటు వంశపారంపర్యంగా  కూడా హైబీపీ రావచ్చు. ఈ సమస్యను తొలిదశలోనే గుర్తించి నివారిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు గానీ నిర్లక్ష్యం చేస్తే అది దీర్ఘకాలం కొనసాగి శరీరంలోని కీలక అవయవాల పనితీరును కోలుకోలేంతగా దెబ్బ తీస్తుంది. హైబీపీ కారణంగా తలెత్తే దుష్పరిణామాలేమిటో తెలుసుకుందాం.

దుష్పరిణామాలు 

  • హైబీపీ తెచ్చే ప్రధానమైన ముప్పు కిడ్నీల పనితీరును కోలుకోలేనంతగా దెబ్బతీయటం. ప్రతి 100 మంది కిడ్నీ సమస్యల బాధితుల్లో కనీసం 70 మందిలో  హైబీపీ ప్రధాన కారణంగా ఉంటోంది.
  • హైబీపీ వల్ల మెదడు రక్తనాళాలు దెబ్బతిని మెదడులోని కొన్ని భాగాలకు రక్తప్రసారం నిలిచిపోయి అంతిమంగా పక్షవాతానికి దారితీస్తుంది. తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా రక్తనాళాలు చిట్లి మెదడులో రక్తస్రావమై పక్షవాతానికి దారి తీయవచ్చు.
  • హైబీపీ కారణంగా కంటిలోని రెటీనాపై ఉండే రక్తనాళాలు దెబ్బతింటాయి. దీనికి మధుమేహం సైతం తోడైతే కంటిచూపు తగ్గి పూర్తిగా అంధత్వం సంక్రమిస్తుంది.  ఈ పరిస్థితిలో ఎలాంటి వైద్యచికిత్సా పెద్దగా ఉపయోగపడదు.
  • హైబీపీ గుండె రక్తనాళాలను బలహీనం చేసి గుండెపోటుకు దారితీస్తుంది. గుండె నుంచి రక్తాన్ని సరఫరా చేసే ధమని ఉబ్బటం, అంతిమంగా చిట్లి ప్రమాదానికి దారితీస్తుంది.
  • హైబీపీ వల్ల శరీర వ్యాప్తంగా ఉండే రక్తనాళాలు దెబ్బతిని రక్తప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల కాళ్ళ నొప్పులు, అలసట తదితర సమస్యలు రావచ్చు.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE