• HOME
  • ఆరోగ్యం
  • స్టెమ్‌సెల్‌ చికిత్సతో నడుమునొప్పికి చెక్

నడకలో తడబాటు, నడుంనొప్పి తదితర సమస్యలతో బాధ పడుతున్నారా? అందుబాటులో ఉన్న అన్ని రకాల  చికిత్సలతో ఫలితం లేదని విసిగిపోయారా? అయితే స్టెమ్‌సెల్‌ చికిత్సతో ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ విధానాన్ని అటోలాగస్‌ స్టెమ్‌సెల్‌ ప్రోసీజర్‌ అంటారు. ఎముక కణజాలం పూర్తిగా నశించిన వారికి ఈ చికిత్స ఒక వరమని చెప్పాలి. ఈ విధానంలో కొద్దిపాటి కోట పెట్టి బాధితుడి వెన్నపూస  చివరి భాగం నుంచి మజ్జను సేకరిస్తారు. కేవలం పావుగంట సమయంలో మూల కణాలను ఫ్లోరోస్కోపీ నియంత్రణ పద్ధతి ద్వారా ఎముక కణజాలం నశించిన భాగంలో ప్రవేశ పెడతారు. కృత్రిమమైన యాంత్రిక విధానాల కంటే ఈ జీవ సంబంధిత విధానంలో ఎన్నో స్పష్టమైన ప్రయోజనాలున్నాయి. ఎంతో ఖర్చుతో బాటు  సమస్యలతో కూడిన కీలు మార్పిడి పద్ధతి లోని పరిమితులనూ ఈ నూతన విధానంలో అధిగమించవచ్చు.  మోకాలి అస్టియో అర్థరైటిస్‌, భుజం నడుము, మడమ, మోచేతులు, పక్కటెముకలు, వెన్నుపూస  తదితర భాగాలకూ అటోలాగస్‌ స్టెమ్‌సెల్‌ పద్ధతి విస్తరించనుంది.



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE