పాము అంటే ఎవరికైనా కాస్త భయమే.పాము కాటేసిందనే మాట వినగానే ప్రాణాపాయం తప్పదనే భావనకు వచ్చేవారి సంఖ్య తక్కువేమీ కాదు. పాముల పట్ల వుండే అపోహలు, భయాలే దీనికి ప్రధాన కారణం. చాలా మంది అనుకున్నట్లు నూటికి 60 శాతం పాములు విష సర్పాలు కావు. మిగిలిన 40 శాతంలోనూ ప్రమాదం కలిగించేవి కేవలం 20 శాతం మాత్రమే. అవగాహనా లోపంతో విషసర్పం కాటుకు గురైనా సొంత వైద్యంతో సరిపెట్టి ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు కొందరైతే, అసలు విషం  లేని పాము కరిచినా కేవలం భయంతో చని పోతున్న వారు మరికొందరు. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరమైన విషయం. ఇప్పటికీ మనదేశంలో పాముకాటుతో చనిపోతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉండటం పరిస్థితికి అద్దం పడుతోంది.  అయితే వీలున్నంత వేగంగా ప్రథమ చికిత్స చేసి వైద్య చికిత్స అందించగలిగితే ఈ మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చు.  జులై 16న వరల్డ్ స్నేక్ డే సందర్భంగా పాముకాటుకు సంబంధించిన కొంత సమాచారాన్ని గురించి ఇప్పడు తెలుసుకుందాం.

పాముకాటు లక్షణాలు

 • కాటు వేసిన చోట పాము కోరల గాయం స్పష్టంగా కనిపించి, తీవ్రమైన నొప్పి ఉంటుంది
 • ఈ నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ, తిమ్మిరిగా అనిపిస్తుంది
 • పాక్షిక పక్షవాతం వల్ల నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకున్నట్టు గొంతులో ఏదీ దిగనట్లు అనిపిస్తుంది.
 • కొందరిలో చొంగకారటం, కళ్ళు బైర్లుగమ్మటం, మగతగా ఉండటం, స్పృహ కోల్పోవటం జరగొచ్చు.

పామును గుర్తించటం

కరచినది ఏ పామో తెలిస్తే చికిత్స మరింత సులభమవుతుంది. ఎందుకంటే కాటేసిన పామును బట్టి వాటి లక్షణాలు మారతాయి. కాటు ద్వారా బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిణామం బట్టి కూడా ప్రమాదం స్ధాయి ఉంటుంది. సాధారణ త్రాచు విష ప్రభావం కాస్త వ్యవధి తీసుకుంటుంది గానీ  నల్లత్రాచు (కింగ్ కోబ్రా) విషం ప్రభావం చాలా త్వరగా కనిపించి ప్రాణాంతకంగా మారుతుంది. కట్లపాము కాటు బాధ,  రక్తపింజర విష లక్షణాలు వేరువేరుగా ఉంటాయి.

ప్రథమ చికిత్స.. ఇతర సూచనలు 

 • బాధితుడిని ప్రశాంతంగా ఉంచాలి. భయాందోళనలకు, కలవరపాటుకు గురికాకుండా పొరుగువారు ధైర్యం చెప్పాలి.  తీవ్రమైన ఒత్తిడి చర్యల వలన రక్త ప్రవాహం పెరుగుతుంది.
 • బాధితుడిని నడిపించవద్దు. ఆటో, బైక్, ఆంబులెన్స్ ను ఆశ్రయించటం మంచిది.
 • పాము కరిచిన చోట తువ్వాలు, తాడు వంటి వాటితో గట్టిగా కట్టుకడితే రక్తం ఇతర భాగాలకు చేరటం ఆలస్యమై ప్రమాద తీవ్రత తగ్గుతుంది
 • పాముకాటుకు గురైన వ్యక్తికి తినేందుకు లేదా తాగేందుకు ఏమీ ఇవ్వకూడదు. సొంత వైద్యం అసలే పనికిరాదు.
 • బాధితుడిని నిశ్శబ్దంగా ఉంచండి. అవకాశం ఉంటే ఈ పామో గుర్తించేందుకు ప్రయత్నించాలి.
 • కరచిన చోట చాకుతో కోయటం వంటివి చేయకూడదు.
 • నాటు వైద్యం, మంత్రతంత్రాల పేరిట సమయం వృధా చేయక తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళాలి.

కొన్ని జాగ్రత్తలు

 • ధాన్యపు గాదెలు, గడ్డి వాముల వంటి చోట ఉండే ఎలుకలు, తడి ప్రాంతంలో ఉండే కప్పల కోసం పాములు వస్తాయి గనుక అలాంటి చోట జాగ్రత్తగా ఉండాలి.
 • స్టార్ రూమ్స్, ఇతర ప్రాంతాల్లో ఉంచిన వస్తువులు, దుంగలు, కట్టెలు కదిలించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
 • పొలాలు, పార్కులు, నర్సరీల వెంట నడిచేటప్పుడు కర్ర చప్పుడు చేస్తూ నడవడం మంచిది.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE