ఐదారేళ్ళ వయసు పిల్లలు అప్పుడప్పుడు ఫిట్స్ బారిన పడటం అసాధారణమైన విషయమేమీ కాదు. తీవ్రంగా భయపడినప్పుడు, చేస్తున్న పనిని పెద్దలు బలవంతంగా నిరోధించినప్పుడు, తాము కోరిన వస్తువు ఇవ్వనప్పుడు గుక్కపట్టి ఏడ్చి, అంతలోనే  ఫిట్స్ కనిపించటం జరుగుతుంది. చిన్నారుల మెదడు నుంచి విడుదలయ్యే ఫిట్స్ లేక సీజర్స్ అనే అవాంఛిత ఎలక్ట్రిక్ తరంగాల మూలంగా ఈ సమస్య వస్తుంది. ఈ సమయంలో మెదడుకు రక్తం అందక, ప్రాణవాయువు నిలిచిపోవటం మూలంగా శరీరం నియంత్రణ లేకుండా తీవ్రమైన కదలికలకు లోనవుతుంది.

 కారణాలు, లక్షణాలు

రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవటం, ఇన్ఫెక్షన్లు, తలకు బలమైన దెబ్బ తగిలినప్పుడు, విషప్రయోగం జరిగిన సందర్భాల్లో, ఔషధాలు వికటించినప్పుడు, మెదడులో కణుతులు ఏర్పడినప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి తీవ్రమైన జ్వరం కూడా సమస్యకు కారణం కావచ్చు. ఈ సమయంలో శ్వాశ తీసుకోలేకపోవటం, ఏడుస్తున్నప్పుడు గుక్క తిప్పుకోలేకపోవటం, శరీరం నీలంగా మారటం, కండరాలు బిగదీసుకుపోవటం వంటి లక్షణాలతో బాటు సృహ కోల్పోవటం కూడా ఉండొచ్చు. నిజానికి ఇది ప్రాణాంతక సమస్య కాకున్నా వీలున్నంత త్వరగా వైద్యుడికి చూపించి తగు చికిత్స తీసుకుంటే మళ్లీమళ్లీ రాకుండా చూసుకోవచ్చు.

చికిత్స

చిన్నారుల్లో కనిపించే ఏ అనారోగ్య సమస్యకైనా హోమియోపతి వైద్యంలో తగిన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఇతర వైద్య విధానాలు సూచించే ఔషధాలతో పోల్చినప్పుడు పిల్లలు తీయగా ఉండే హోమియోపతి మందులను వద్దనకుండా, ఇంకా చెప్పాలంటే ఇష్టంగా కూడా తీసుకుంటారు.

వాడాల్సిన హోమియో మందులు

ఏత్యూజా

 పిల్లలకు పాలు గిట్టకపోతే పాలు తాగిన ప్రతిసారీ పెరుగులా ఒక్కసారిగా వాంతి చేసుకుంటారు. ఈ సమయంలో కళ్ళు వేళ్ళాడేయటం, కంటిపాపలు ఒక్క క్షణం పాటు కదలకుండా ఉండిపోవటం, నోరు బిగదీసుకుపోవటం, నోటి నుంచి నురగలు రావటం, నాడి వేగం తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలున్న పిల్లలకు ఏత్యూజా చక్కగా పనిచేస్తుంది.

బెల్లడోనా

ఫిట్స్ కారణంగా తల వేడెక్కటం, కళ్ళు, ముఖం ఎర్రగా మారటం, తల నరాల్లో రక్త ప్రసారం ఎక్కువై అవి ఉబ్బెత్తుగా మారటం, తలను తలగడకు అదిమి పెట్టటం, కనుపాపలు వెడల్పుగా మారటం వంటి లక్షణాలున్న పిల్లలకు బెల్లడోనా వాడితే సమస్య అదుపులోకి వస్తుంది.

చామోమిల్లా

తల్లి తీవ్రమైన కోపంలో ఉన్నప్పుడు, అతిగా భయపడుతున్న సమయంలో పాలు తాగిన పిల్లలకు, పాలపళ్ళు వచ్చే సమయంలో ఫిట్స్ వచ్చినా, ఏడుస్తున్నప్పుడు ఎత్తుకుంటే వెంటనే ఏడుపు ఆపేవారు, కోపం వచ్చినప్పుడు ముఖం ఒకవైపు ఎర్రబడటం, మరో సగం పాలిపోవటం వంటి లక్షణాలున్న పిల్లలు ఫిట్స్ బారినపడితే చామోమిల్లా వాడొచ్చు.

సినా

కడుపులో పురుగుల మూలంగా పిల్లలు పళ్ళు కొరుకుతూ ఉంటారు. వీరు ఎంత ఆకలిగా ఉన్నా పాలు తాగేందుకు ఇష్టపడరు. తీయని పదార్థాలను ఇష్టపడుతుంటారు. ఈ లక్షణాలున్న పిల్లలు ఫిట్స్ బారిన పడితే ఈ మందు వాడొచ్చు.

స్ట్రామోనియం

ఒంటరిగా ఉండటం వల్ల కలిగిన భయం, నీళ్లు, అద్దం చూసి భయపడి ఫిట్స్ బారిన పడిన చిన్నారులు ఈ మందు వాడితే వెంటనే తేరుకుంటారు. ఫైట్స్ వచ్చినా సృహ కోల్పోని పిల్లలకూ ఈ మందు వాడొచ్చు.

                                                                                            - డా. భోగాది రాజశేఖర్ , ష్యూర్ కేర్ హోమియోపతి Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE