వానాకాలంలో దద్దుర్ల వంటి చర్మ సమస్యలు సహజమే. చల్లని గాలిలోకి వెళ్లిన మరుక్షణమే ఒక్కసారిగా ఒళ్ళంతా గులాబీ రంగులో దద్దుర్లు ఏర్పడి, కాసేపటికి వాటంతట అవి తగ్గిపోతాయి. సాధారణంగా పిల్లలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతుంటారు. కొందరిలో ఇవి కొన్ని రోజుల వరకూ ఉండి దురద, మంటతో తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. చిన్న పిల్లలలో కనిపించే దద్దుర్లను వైద్యపరిభాషలో హైవ్స్‌ అంటారు. తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న పిల్లల్లో ఈ సమస్య తోడైతే ప్రమాదకరంగా మారవచ్చు.

లక్షణాలు

 • చర్మంపై వివిధ సైజుల్లో దద్దుర్లు, దురదలు రావటం
 • దద్దుర్లు నిముషాల నుండి కొన్ని గంటల వరకూ ఉండటం
 • గోకినప్పుడు మరింత ఎక్కువ కావటం
 • ఒకచోట తగ్గగానే మరోచోట కనిపించటం
 • దురద, మంట
 • తీవ్రమైన మలబద్దకం
 • నీరసంగా, వికారంగా ఉండటం,
 • వాంతులు, విరేచనాలు

 కారణాలు

 • రోగనిరోధక శక్తి లోపాలు
 • మానసిక ఆందోళన ఎక్కువ కావటం
 • సరిపడని ఆహారం తీసుకోవటం మూలంగా
 • జీర్ణకోశ వ్యాధుల ప్రభావం
 • పలు రకాల ఎలర్జీల మూలంగా
 • కాలేయం పనితీరు దెబ్బతినటం

చికిత్స

పిల్లల్లో తాత్కాలికంగా దద్దుర్ల సమస్య కనిపించటం సహజమే. అయితే తరచూ కనబడితే మాత్రం దానిని తీవ్రంగానే పరిగణించాలి. దద్దుర్లు కనిపించగానే కొందరు ఎవిల్, సిట్రజిన్ వంటి మందులు వేసుకొంటారు గానీ ఇది సరైన పద్దతి కాదు. ఈ మందుల వల్ల అప్పటికి సమస్య తగ్గినట్లు అనిపించినా అది మళ్ళీ రావచ్చు. వైద్యుల సలహా ప్రకారం పూర్తికాలం చికిత్స తీసుకొంటే ఈ సమస్య మళ్ళీమళ్ళీ రాకుండా చూసుకోవచ్చు. మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. దద్దుర్లులతో చర్మం పూర్తిగా వ్యాధినిరోధక శక్తి కోల్పోయిన దశలో అది సొరియాసిస్ గానూ మారే ముప్పు ఉంది. అందుకే తొలిదశలోనే సమస్యను గుర్తించి చికిత్స తీసుకోవాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE