కొన్నిఅనారోగ్యసమస్యలు బాధితుడినే గాక చుట్టూ ఉన్నవారినీ ఇబ్బంది పెడతాయి. అలాంటి వాటిలో  గురక ప్రధానమైనది. గురక పెట్టేవారి కంటే వారి పక్కన పడుకున్న వారి బాధ వర్ణనాతీతం. చాలామంది ఇది ఒక అలవాటు అనుకుంటారు గానీ నిజానికి ఇదొక అ నారోగ్య సమస్య. గురక మూలంగా ఊపిరితిత్తులకు రక్తప్రసరణ తగ్గటంతో రక్తంలో సరిపడా ఆక్సిజన్ అందక రక్తపోటు పెరిగి హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. గురక కారణంగా  దంపతుల వైవాహిక జీవితంలోనూ సమస్యలు వస్తున్నాయి. చాలా మంది ఈ సమస్యకు చికిత్స లేదని భావిస్తుంటారు.  అందుకే గురకకు కారణాలు, నివారణ, చికిత్స సంబంధిత అంశాల పట్ల తగినంత అవగాహన పెంచుకొంటే సులభంగా ఈ సమస్య బారి నుంచి తప్పించుకోవచ్చు.

కారణాలు 

నిద్రకు ఉపక్రమించే సమయంలో శ్వాస మార్గంలో అవరోధం ఏర్పడటమే ‘గురక’కు ప్రధాన కారణం. సాధారణంగా శ్వాస మార్గంలో అవరోధం ఏర్పడటంలో మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, ధూమపానం,సాధారణ జలుబు, టాన్సిల్స్, ముక్కుదూలం వంకరగా ఉండటం, కొన్ని భంగిమల్లో నిద్రించటం, ఛాతీ కండరాల బలహీనత, గొంతు శ్వాసమార్గ నిర్మాణంలో తేడాల మూలంగా శ్వాస మార్గంఒత్తిడికి గురవుతుంది. అయితే ఈ విషయం తెలియని పలువురు గురక వంశపారంపర్యంగా వస్తుందనీ లేదా ఇతరత్రా అనారోగ్యం మూలంగా వస్తుందని అపోహ పడుతుంటారు.

నివారణ..చికిత్స

  • పడుకునే భంగిమ గురకకు కారణం అయితే ఆ వ్యక్తి టెన్నిస్ బాల్‌ని పైజమా జేబులో పెట్టుకుని పడుకుంటే గురక పెట్టేవాళ్ళు ఆ వైపు నిద్రలో కూడా తిరగరు. దీనివల్ల నిద్రాభంగం కలగకుండానే సమస్యను నివారించవచ్చు.
  • పక్కకు తిరిగి పడుకోవటం, తలవైపు తగిన ఎత్తు ఉండేలా చూసుకోవాలి.
  • మరిగే నీటిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పడితే శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.
  • ఎలర్జీ కలిగించే ఆహారం తీసుకోకపోవటం మంచిది.
  • గురకకు మితిమీరిన మద్యపానం కారణం అయితే ఆ అలవాటును మానుకోవాల్సిందే.
  • ఊబకాయం, అధిక బరువు కారణంగా గురక వస్తుంటే తగినంత వ్యాయామం చేసి బరువును తగ్గించుకోవాలి.
  • నిద్రమాత్రలు వేసుకోవడం వల్ల గురక వస్తున్నవారు యోగా వంటి సాధనల సాయంతో మాత్రల అవసరం లేకుండా చేసుకోవాలి.
  • గురకకు టాన్సిల్స్, ముక్కుదూలం వంకర, ఎడినాయిడ్స్, పాలిప్స్ వంటివి కారణాలైతే శస్తచ్రికిత్స చేయించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE