మన శరీరంలోని కీలకఅవయవాల్లో గుండె ఒకటి. శరీరంలోని అవయవాలకు విరామ లేకుండా  రక్తాన్ని పంపింగ్ చేయటమే దీని పని.  ఏళ్ళ తరబడి నిరంతరాయంగా పనిచేయటం, జీవన శైలి మార్పులు, దురలవాట్ల వంటి పలు బయటి ప్రభావాల కారణంగా వయసుతో బాటు గుండెపని తీరు తగ్గుతూ పోతుంది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించక పోతే ఇది  గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటుతో బాటు ప్రాణాంతకంగా మారుతున్న పలు హృదయ సంబంధిత సమస్యల్ఏ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 29న 'ప్రపంచ హృదయ దినోత్సవం' పేరిట జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ సంస్థలు  సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా గుండె ఆరోగ్యం మీద పలు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాయి.  ఈ సందర్భంగాగుండెపోటు గురించి నిపుణులు చెప్పే ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం.

గుండెపోటు

గుండె రక్తనాళంలో కొవ్వు పేరుకుని, కొలెస్ట్రాల్‌ రక్తంలో గడ్డకట్టి గుండె కండరానికి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల గుండె కండరం దెబ్బతింటుంది. ఈ పరిస్థితినే గుండెపోటు అంటారు. 

లక్షణాలు

 • ఛాతీ మధ్యలో ఊహించని, వర్ణించలేని నొప్పి, ఛాతీ బరువుగా ఉండటం 
 • ఛాతీ నొప్పి భుజానికి, చేతులకు, వీపు, దవడకు పాకటం, సమయం గడుస్తున్నా తగ్గకపోవడం
 • ఒళ్ళు మంచులా చల్లబడటం, చెమటలు పట్టటం, ఊపిరి తీసుకోవటం కష్టం కావటం
 • శరీరము చచ్చుబడిన భావన, వాంతి వచ్చేట్టు అనిపించటం, తలతిరుగుడు

కారణాలు

 • ధూమపానం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం
 • రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగావటం
 • వంశపారంపర్య కారకాలు, మానసిక ఒత్తిడి అధికం కావటం

హై రిస్క్ గ్రూప్

 • అధిక రక్తపోటు బాధితులు, అదుపుతప్పిన మధుమేహులకు, వ్యాయామం ఊసు లేనివారు
 • వృద్ధులు, నీడపట్టున కూర్చొనేవారు, ఊబకాయ బాధితులకు,
 • రోజూ మితిమీరిన మోతాదులో మద్యం సేవించేవారు, అతిగా ధూమపానానికి అలవాటు పడినవారు

నివారణకు జాగ్రత్తలు

 • ధూమపానం, పొగాకు నమలటం, మద్యపానానికి దూరంగా ఉండాలి.
 • రోజూ కనీసం ౩౦ నిమిషాల పాటు వ్యాయమం చేయాలి
 • రక్తపోటు, మధుమేహాలను పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి
 • రోజువారీ ఆహారంలో పండ్లు, పచ్చి కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు ఉండేలా చూసుకోవాలి.
 • అధిక శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి.

ప్రథమచికిత్స

 • హటాత్తుగా గుండెపోటు వచ్చిన సందర్భంలో బాధితుడిని గాలి తగిలే చోట పడుకోబెట్టి దుస్తులను వదులు చేయాలి. అవకాశం ఉంటే ఆక్సిజన్ అందించాలి.
 • సార్బిట్రేట్ లేదా నైట్రోగ్లిజరిన్ మాత్రలు బాధితుడి నాలుక క్రింద ఉంచాలి.
 • అంబులెన్సు వచ్చే వరకూ బాధితుడితో మాట్లాడుతూ అతడినీ మాట్లాడేలా ప్రోత్సహించాలి.
 • ఆసుపత్రిలో వైద్యం ఆరంభించబోయే ముందు గతంలో జరిగిన చికిత్సల వంటి వివరాలు అందించాలి.

 Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE