మన శరీరంలో జరిగే జీవక్రియల నిర్వహణలో హార్మోన్ల ప్రాధాన్యం చాలా కీలకం. హార్మోన్‌లు పాలీపెప్టైడ్స్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయినకణజాలం లేదా గ్రంథుల నుంచి ఇవి శరీర భాగాలకు రక్తం ద్వారా చేరుతూ నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సమతౌల్యంతో పని చేస్తేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. లేకుంటేఆ ప్రభావం జీవక్రియల మీద పడుతుంది. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. నిజానికి వీటి పరిమాణం బహు తక్కువే అయినా జీర్ణక్రియ, శారీరక-మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి ప్రధానమైన వ్యవస్థల మీద అవి చూపేప్రభావం చాలా కీలకం. హార్మోన్ల ఉత్పత్తి, పనితీరులో మార్పులు జీవక్రియల మీద ప్రభావం చూపి క్రమంగా తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బులకు దారి తీస్తాయి. ఇటీవలి కాలంలో ఈ తరహా సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో హార్మోన్ల పనితీరును మెరుగు పరిచే కొన్ని సూచనలు గురించి తెలుసుకుందాం.

 రోజూ తేలికపాటి నడక, జాగింగ్, ఈత వంటి తేలికపాటి వ్యాయామం చేసేవారిలో హార్మోన్లకు సంబంధించిన సమస్యలు రావు. ఇప్పటికే ఈ తరహా సమస్యలు ఉన్నవారు వ్యాయామం చేయటం ద్వారా సమస్య దూరం అవుతుంది.

  • కంటి నిండా నిద్రలేని వారికి హార్మోన్ల సమస్యలు అధికం. అందుకే కనీసం రోజుకి 7 గంటలు నిద్ర అవసరం.
  • అధిక బరువు ఊబకాయానికి దారితీసి హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అందుకే బరువు అదుపులో ఉండేలా చూడాలి.
  • సమతుల ఆహారం తీసుకునే వారికి హార్మోన్ల సమస్యలు వచ్చే అవకాశం తక్కువ.అందుకే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు తగుపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. పీచు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఉండేలా చూసుకోవాలి.
  • హార్మోన్ల సమస్యలకు కొబ్బరి నూనె చక్కని ఔషధంగా ఉపయోగపడుతుంది. రోజూ కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయటం, వంటకు కొబ్బరి నూనె వాడటం వల్ల హార్మోన్ల సమస్యలే గాక బరువూ తగ్గొచ్చు.
  • స్టీల్, నాన్‌స్టిక్‌, టెఫ్లాన్‌ కోటెడ్‌ పాత్రల్లోనే ఆహారం వండుకోవాలి. ఆహారం నిల్వకు పింగాణీ, గాజు పాత్రలు వాడుకోవచ్చు. ప్లాస్టిక్పాత్రలు, గిన్నెలుఅసలు వాడొద్దు.
  • ఊబకాయం పేరిట కొవ్వు లేని ఆహారం తీసుకోవటమూ హార్మోన్ల సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే ఆహారంలో మేలుచేసే కొవ్వులు తగినంత పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి.
  • రోజుకి 2 కప్పులకుమించి కాఫీ సేవించే వారిలో ఈ తరహా సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున కాఫీ వినియోగాన్ని పరిమితం చేయాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE