మీరు ఉద్యోగులా? రోజుకు 10 గంటలపాటు కంప్యూటర్ మీద పనిచేస్తున్నారా? ఇటీవల తరచూ కళ్లు తడి ఆరిపోయినట్లు , కంటి నొప్పి, తల, మెడ కండరాల నొప్పులుగా ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే మీరు ఈపాటికే కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌) బారిన పడి  ఉండొచ్చు.  ఇదేమీ కంగారుపడాల్సిన అనారోగ్య సమస్య కాదుగానీ దీర్ఘకాలం సమస్య కొనసాగితే స్పాండిలైటిస్ వంటి అనారోగ్యాలకు దారితీయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు కోటి మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. మీకిప్పటికే పై లక్షణాలు కనిపిస్తే నేత్ర వైద్యులను కలిసి సలహా కోరటం మంచిది.

కారణాలు, లక్షణాలు

 కంప్యూటర్‌ స్క్రీన్‌నుంచి వెలువడే రేడియేషన్‌, కూర్చున్న చోట వెలుతురులో ఉండే హెచ్చుతగ్గులు, కంప్యూటర్‌ అమరిక, కంప్యూటర్‌ ముందు కూర్చునే భంగిమ, అతిగా కంప్యూటర్ వాడటం వంటి కారణాల వల్ల కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌ (సివిఎస్‌) వస్తుంది. కొన్నిసార్లు దృష్టి లోపాలు కూడా సమస్యకి కారణం కావచ్చు. ఈ సమస్య బారినపడితే కళ్లు పొడిబారినట్లు అనిపించటం, కంటి నొప్పి, తల, మెడ కండరాల నొప్పులు ఉంటాయి.

జాగ్రత్తలు

  • కంప్యూటర్ తెర వెలుతురు, అక్షరాలు, చిత్రాల రంగు మోతాదులో ఉండేలా చూసుకోకపోతే కంటిమీద ఒత్తిడి అధికమవుతుంది. అందుకే తగిన ఆప్షన్ వాడి సరిచేసుకోవాలి.
  • కంప్యూటర్ తెర ప్రభావం నేరుగా కంటిమీద పడకుండా కంప్యూటర్ తెర మీద యాంటీ గ్లేర్ స్క్రీన్ ఏర్పాటుచేసుకోవాలి. తక్కువ రేడియేషన్‌ గల నాణ్యత గల మోనిటర్ ఎంపిక చేసుకోవటం అవసరం.
  • ఏసీ గాలి, హాయ్ వోల్టేజ్ దీపాల కాంతి నేరుగా కళ్ళకు తగలకుండా చూసుకోవాలి.
  • కంప్యూటర్ కుర్చీలోనే తప్పరోజుకో కుర్చీలో కూర్చోవద్దు. అవసరాన్ని బట్టి కాళ్ళకింద ఫుట్‌రెస్ట్‌ వాడాలి.
  • కంప్యూటర్టేబుల్ ఎత్తుకు తగిన, సౌకర్యవంతమైన కుర్చీని మాత్రమే ఎంపికచేసుకోవాలి. వెన్ను మీద భారం పడకుండా చిన్న దిండు వంటిది నడుము, కుర్చీ వెనకవైపు పెట్టుకోవాలి.
  • కూర్చున్న వ్యక్తి,కంప్యూటర్తెరసమాంతరంగా గాకతెరకనీసం 4 నుంచి 6 అంగుళాలు దిగువకు ఉండాలి.దీనివలన కంటి రెప్పలు, కళ్ళను కప్పి తగినంత తేమ ఉండేలా చేస్తాయి. అలాగే.. కంటికి తెరకు మధ్య55 నుంచి 75 సెంటీ మీటర్స్ దూరం ఉండాలి.
  • కంప్యూటర్‌పై పని చేసే సమయంలో కను రెప్పలు కొట్టుకోవడం తగ్గుతుంది. దీనివల్ల కళ్ళు పొడిబారతాయి. ఇలాంటప్పుడు తరచూ కళ్ళు మూసితెరవటం, సవ్య, అపసవ్య దిశల్లో కనుగుడ్లు తిప్పటం, మరీ అవసరమైతే వైద్య సలహా మేరకు ఐ డ్రాప్స్ వాడాలి.
  • కంప్యూటర్‌పై పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకోసారి కుర్చీలోంచి లేచి 5నిమిషాల పాటు నడవాలి. వీలుంటే బయట కనిపించే పచ్చని మొక్కలు, చెట్లను చూడటం మంచిది. Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE