ముప్పయ్యేళ్లు దాటిన మహిళలు ఎవరికీ వారు అద్దం ముందు నిలబడి రొమ్ములను పరిశీలించుకోవటం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో రొమ్ములలో ఊహించని మార్పులు ఉంటే వీలున్నంత త్వరగా వైద్యుడిని సంప్రదించే వీలుంటుంది. దీని వల్ల సమస్యను గుర్తించటమే గాక వేగంగా చికిత్స అందించే అవకాశం ఉంటుంది.

ఇలా చేయాలి

  1. ముందుగా భుజాలను సమానంగా ఉంచి, చేతులను పిక్కలపై ఉంచి అద్దంలో మీ రొమ్ముల పరిమాణం, ఆకారం, రంగులో మార్పు, వాపు రొమ్ము పై గుంటలు, ముడుతలు, వాపు, చనుమొన లోపలికి ముడుచుకుపోవటం, రొమ్ముపై ఎర్రని మచ్చలు, దద్దురులు, పుండ్లు ఉన్నాయేమో పరిశీలించుకోవాలి. 
  1. అదే భంగిమలో నిలబడి చను మొనల నుండి నీరులా, తెల్లగా, పసుపు పచ్చగా లేదా రక్తం గాని ద్రవంగానీ విడుదల అవుతుందేమోనని పరిశీలించండి. 
  1. ఇప్పుడు వెల్లికిలా పడుకొని కుడి చేతి వేళ్ళతో ఎడమ రొమ్ము, ఎడమ చేతి వేళ్ళతో కుడి రొమ్ము చన్ను నుండి మొదలుపెట్టి గుండ్రంగా , మృదువుగా వత్తుకుంటూ వేళ్ళను కదిలించాలి. మొత్తం రొమ్మును అన్నివైపులా పరిశీలించుకోవాలి. అయితే లోపలి వెళ్ళేకొద్ది బలాన్ని పెంచుతూ వత్తి చూడాలి. ఫై భాగాన్ని వత్తుతున్నపుడు మృదువుగా, తర్వాత భాగాన్ని కొంచెం బలంగా, ఇంకా లోపలి భాగాన్ని ఎక్కువ బలంగా, దాదాపు పక్కటెముకలు తాకే విధంగా వత్తాలి. 
  1. ఇప్పుడు నిలుచొని పైన చెప్పిన విధంగా మరోమారు పరీక్షించుకొని చూడాలి. 

ఈ పరిశీలనలో గడ్డలున్నా, నొప్పి అనిపించినా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఒకవేళ రొమ్ముక్యాన్సర్ అని నిర్దారణ అయినా ధైర్యంగా చికిత్సకు సిద్ధం కావాలి. ఇప్పుడు అందుబాటులో ఉన్న పలు రకాల చికిత్సలు రొమ్ము క్యాన్సర్ తీవ్రతను తక్కువ సమయంలోనే తగ్గించగలుగుతున్నాయి.Recent Storiesbpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE