నవ్వు మనిషికి లభించిన గొప్ప వరం.ఇది ఆరోగ్యాన్ని కలిగించే అంటువ్యాధి. హాయిగా నవ్వగలిగితే ఎంత బరువెక్కిన మనసైనా క్షణకాలంలో తేలికపడుతుంది. మారినకాలంలో అటు వ్యక్తిగతమైన, ఇటు వృత్తిపరమైన ఒత్తిళ్లతో సతమతమయ్యే మనిషికి నవ్వును మించిన ఔషధం లేదు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే వారికి చక్కని ఆరోగ్యం చేకూరుతుందనేది నిపుణులు చెబుతున్న మాట. యాంత్రిక జీవిత చట్రంలో ఇరుక్కుపోయిన సగటు మనిషికి నగరాల్లో విస్తరిస్తున్న లాఫింగ్ క్లబ్బులే గొప్ప ఊరటనిస్తున్నాయి. ఈ కింది ఉపయోగాలు తెలుసుకుంటే నవ్వు నాలుగు విధాల చేటు కాదు.. నలభై విధాల గ్రేట్ అని నమ్మితీరతారు.

ఉపయోగాలు

  • నవ్వు ఆరోగ్యకరమైన వ్యాయామం. నవ్వు కారణంగా శరీరంలో కండరాలు, నరాలు, అవయవాలు ఉత్తేజితమవుతాయి.
  • నవ్వు సత్సంబంధాలు ఏర్పడేందుకు, మంచి అభిప్రాయం ఏర్పడేందుకు దోహదపడుతుంది.
  • నవ్వు శరీరంలోని జీవక్రియల వేగాన్ని మెరుగుపరచటమే గాకవ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
  • నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే మనసారా నవ్వే వారికి మానసిక సమస్యలు, ఒత్తిడి ఉండవు.
  • నవ్వేటప్పుడు నోరు తెరుచుకొంటుంది గనుక తగినంత ప్రాణవాయువు శరీరానికి అందుతుంది.
  • ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమంగా జరిగి శ్వాసతీరు మెరుగుపడుతుంది.
  • గుండె దడ, తెలియని ఆందోళ వంటివి ఒక్క చిరునవ్వుతో దూరం అవుతాయి.
  • మనస్సులోని దిగులును, బాధలను మరపింపచేసి మనస్సును తేలికచేస్తుంది.
  • ప్రతికూల పరిస్థితిని అధిగమించే సామర్ధ్యాన్ని, సానుకూల దృక్పథాన్నినవ్వు అందిస్తుంది.
  • ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
  • నవ్వుజ్ఞాపక శక్తిని పెంపొందింపజేస్తుంది.
  • నవ్వేవారి ముఖం అందంగా ఉండటమే గాక ముఖ చర్మం కూడా ముడతలు పడదు. 



Recent Stories







bpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE