ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడో, బరువులు ఎత్తినప్పుడో  లేదా ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చున్నప్పుడో నడుము పట్టేయటం, నడుము నొప్పి అనిపించటం  సహజమే. అయితే సాధారణంగా ఒకటి రెండు రోజుల్లో ఈ తరహా నొప్పులు వాటంతట అవే తగ్గిపోతాయి. అయితే కొన్నిసందర్భాల్లో ఇతర అనారోగ్యం కారణంగా కూడా నడుము నొప్పి వచ్చినా అవగాహన లేక సాధారణ నడుము నొప్పిగా పొరబడే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే ఈ సమస్య విషయంలో  ఉండే అపోహలు, వాస్తవాలను తెలుసుకుంటే ఈ ఇబ్బంది రాదు.

 అపోహ: ముందుకు వంగి నడిచినా, కూర్చున్నా నడుమునొప్పి తప్పదు.

వాస్తవం: కొంచెం ముందుకు వంగి కూర్చున్నంత మాత్రాన నడుము నొప్పి వస్తుందని, పూర్తి  నిటారుగా కూర్చుంటే రాదనీ అనుకోవటం అపోహ మాత్రమే. అందుకే  ఎక్కువ సమయం ఒకే చోట కూర్చోనేటప్పుడు కూచోవాల్సి వస్తే.. కుర్చీ వెనక భాగానికి వెన్ను ఆనించి, కొద్దిగా ముందుకు వంగి కూచోవాలి. ముఖ్యంగా దుకాణదారులు, ఉద్యోగులు కుర్చీలో వెనకవైపు నడుము దిగువన  సపోర్టుగా చిన్న దిండును పెట్టుకోవం మంచిది. పొట్టిగా ఉండేవారు కాళ్లు నేలను తాకేలా కుర్చీని అమర్చుకోవాలి. లేదా కాళ్ళ కింద ఒక చిన్న పీట అమర్చుకోవాలి.  రోజంతా కూచునే ఉండకుండా.. గంటకోసారి లేచి కాస్త అటూఇటూ తిరగటం, ఫోనులో మాట్లాడటం చేయటం మంచిది. 

అపోహ: అధిక బరువులను ఎత్తితే నడుము నొప్పి తప్పదు.

వాస్తవం: ఎంతటి బలవంతులైన పరిమితికి మించిన బరువులు ఎత్తకూడదు. బరువులు ఎత్తేటప్పుడు తగు జాగ్రత్తతో బాటు మెలకువగా ఎత్తితే ఎలాంటి సమస్య ఉండదు. బరువులను నేరుగా కాకుండా ముందుగా కాళ్ళ మీదికి తీసుకొని తర్వాత నెమ్మదిగా శరీరాన్ని సమతుల్యం చేసుకొని ఎత్తాలి. ఇలాంటప్పుడు శరీరం పక్కలకు తిరిగినా, వంగినా ఆ బరువు వెన్నెముక మీద పడే ప్రమాదం ఉంది.  

అపోహ: కొద్దిపాటి నడుమునొప్పి ఉన్నా సంపూర్ణ విశ్రాంతి తప్పనిసరి. 

వాస్తవం:  చిన్నగాయాలు, బెణుకుల వల్ల కలిగే నొప్పికి కొద్దిగా విశ్రాంతి తీసుకోవటం మంచిదే. అయితే రోజంతా మంచానికే పరిమితం కావాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోవటం వల్ల కూడా నడుము నొప్పి మరింత ఎక్కువ కావచ్చు. 

అపోహ: ప్రామాదాల వల్ల, నడుము మీద ఒత్తిడి పడినప్పుడే  నడుము నొప్పి వస్తుంది.

వాస్తవం: నడుము నొప్పికి పై కారణాలతో బాటు వెన్నుపూసల అరుగుదల, కండరాల సమస్యలు, ఇన్‌ఫెక్షన్లు, జన్యు పరమైన కారణాలు కూడా కారణం కావచ్చు.

అపోహ: పీలగా ఉండేవారికి నడుమునొప్పి బెడద ఉండదు.

వాస్తవం: అధిక బరువు కారణంగా నడుము నొప్పి వచ్చే మాట నిజమే.. అంట మాత్రాన పీలగా ఉన్నవారికి నడుము నొప్పి రాదని చెప్పలేము. నడుము నొప్పి ఎవరికైనా రావొచ్చు. పీలగా ఉన్నవారు పోషకాహారం తీసుకోక పోతే ఎముకలు బలహీనపడి తీవ్రమైన నడుమునొప్పి రావచ్చు.

 అపోహ: వ్యాయామం వెన్నెముకకు హాని చేస్తుంది

వాస్తవం:  ఇది కేవలం అపోహే. రోజూ క్రమం తప్పక వ్యాయామం చేసే వారిలో ఎముకలు, వెన్నుముక  బలపడి వెన్నునొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ప్రమాదాల కారణంగా వెన్నునొప్పి వచ్చినప్పుడు కూడా వైద్యులు చికిత్స అనంతరం తేలికపాటి వ్యాయామాలు చేయిస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE