మారుతున్న జీవనశైలి, పని పద్ధతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వంటి కారణాల వల్ల నేటి మనిషి కూర్చున్న చోటి నుంచే అన్ని పనులూ చక్కబెట్టే వెసులుబాటు వచ్చింది.మెలకువగా ఉన్న సమయంలో సుమారు 80 శాతం సమయం కూర్చునే ఉండేవారి సంఖ్య ఇప్పటి రోజుల్లో వేగంగా పెరుగుతోంది. రోజూ సుమారు అరగంట పాటు వ్యాయామం చేసినప్పటికీ ఇలాటివారు ఎక్కువగా అధిక రక్తపోటు, స్థూలకాయం, టైప్‌2 మధుమేహం, గుండెపోటు వంటి రుగ్మతల బారిన పడుతున్నారు. అందుకే ఇలాంటి వారు జీవనశైలి మార్పు చేసుకోవ టంతో బాటు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. 

కుర్చీకే పరిమితమా?

గంటల తరబడి ఒకే చోట, ఒకే భంగిమలో కూర్చునేవారిలో  లైపోప్రోటీన్‌ లైపేజ్‌ (ఎల్‌పీఎల్‌) అనే ఎంజైమ్‌ పనితీరు మందగిస్తుంది. ఇది రక్తంలోని చెడ్డ కొలెస్ట్రాల్‌ను పీల్చుకొని కండరాల రూపంలోకి మారుస్తుంది. కదలకుండా కూచునే వారిలో ఈ ప్రక్రియ ఆగిపోయి రక్తంలో కొవ్వు పెరిగిపోయి, పొట్ట, తదితర భాగాల్లో భారీగా పేరుకుపోతుంది. దీనికితోడు పొత్తికడుపు కండరాలూ మందకొడిగా తయారై బిగుసుకుపోయి బరువు పెరుగుతుంది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అరగంటకు మించి ఒక చోట కూర్చోవాల్సి వస్తే లేచి 5 నిమిషాలు అటూ ఇటూ తిరగాలి. 

వెన్నునొప్పి

గంటలకొద్దీ నిటారుగా కూర్చోవాలంటే వీపు కండరాలు చాలా బలంగా ఉండాలి. లేకపోతే వెన్నెముక ముందుకు వంగి భుజాలు వాలిపోతాయి. ఇది క్రమంగా భుజాలు, మెడ, నడుంనొప్పులకు దారి తీస్తుంది. దీనికితోడు ఆఫీసుల్లో కంప్యూటర్‌ టేబుళ్లు, కుర్చీల ఆకారం, ఎత్తు సరిగా లేకపోవటంతో సమస్య మరింత విషమించి మెడ, వీపు, ఛాతీ, భుజాలు, చేతుల్లోని కండరాలు, నాడులపైనా ప్రభావం చూపుతుంది. 

పాటించాల్సిన జాగ్రత్తలు

  • గంటలకొద్దీ కదలకుండా కూచోవాల్సి వస్తే 20 నిమిషాలకు ఒకసారైనా  లేచి కాస్త అటూఇటూ తిరగాలి.
  • రోజుకి కనీసం 40 నిమిషాల సేపైనా నడక అలవాటు చేసుకోవాలి. ఇది కీళ్లు బాగా పనిచేసేందుకు తోడ్పడుతుంది.
  • ఆఫీసులో సహోద్యోగులతో మాట్లాడేందుకు ఫోన్, ఈ-మెయిళ్ల వంటి వాటికి బదులు కాస్త కాళ్లకు పని కల్పించటం మంచిది.
  • ఖాళీసమయంలో 5 నిమిషాలు ప్రాణాయామం, కపాలభాతి చేస్తే పొట్ట కండరాలు బలపడతాయి.
  • అప్పుడప్పుడు భుజాలను పైకి కదిలించటం, మీద తిప్పటం వంటివి చేస్తే కండరాలకు విరామం లభిస్తుంది.
  • నిలబడి ఫోన్ మాట్లాడటం, ఎక్కువసేపు మాట్లాడాల్సి వస్తే కారిడార్‌లో పచార్లు చేస్తూ సంభాషించటం మేలు.
  • లిఫ్ట్‌ వాడేందుకు బదులు మెట్లు ఎక్కేందుకు ప్రయత్నించాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE