ఇటీవలి కాలంలో లైంగికపరమైన సమస్యలతో వైద్యులను కలిసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇలాంటి వాటిలో శీఘ్ర స్ఖలన సమస్య ప్రధానమైనది. శృంగారంలో పాల్గొన్న 3 నిమిషాల్లోలేదా భాగస్వామికి భావప్రాప్తి కలగకముందే వీర్యస్ఖలనం జరగటాన్ని శీఘ్రస్ఖలనం అంటారు. మెజారిటీ కేసుల్లో మానసిక సమస్యలు, మారుతున్న జీవనవిధానం, దంపతుల అవగాహనలేమి వంటివి ఈ సమస్యకు ప్రధాన కారణాలు. ఈ సమస్య కారణంగా పురుషులు తీవ్ర ఆత్మన్యూనతకు గురై జీవిత భాగస్వామితో దాంపత్య జీవితాన్ని ఆస్వాదించలేక పోతున్నారు. ఒక్కోసారి ఈసమస్య దంపతుల మధ్య గొడవలకు, విడాకులకు కూడా దారితీస్తోంది. తగిన అవగాహనతో ఈ సమస్యను అధిగమించవచ్చు.

కారణాలు

  • రతి అంటే కంగారు, భయం, ఒత్తిడికి గురికావటం వంటి ఇబ్బందులున్న వారిలో ఈ సమస్య ఉంటుంది.
  • డిప్రెషన్ బాధితులు,హార్మోన్ల లోపం ఉన్నవారిలో శీఘ్రస్ఖలనం సమస్య ఎదురయ్యే ముప్పు ఎక్కువ.
  • నాడీ సంబంధ వ్యాధులు, మెదడు సంబంధ వ్యాధుల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు.
  • ప్రొస్టేట్ గ్రంథి, మూత్రనాళాలలో వాపు, ఇన్‌ఫెక్షన్లు కూడా ఈసమస్యకు దారితీస్తాయి.
  • వారాల తరబడి శృంగారంలో పాల్గొనకపోవడం, భాగస్వామి సహకారం సరిగ్గా లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు.
  • యవ్వనపు తొలిరోజుల్లో హస్తప్రయోగం చేసుకొనే సమయంలో ఎవరైనా వస్తారని, చూస్తారనే భయంతో తొందరగా చేయడం అలవాటుగా మారి తరువాతి రోజుల్లో శీఘ్ర స్ఖలన సమస్యకు దారితీయవచ్చు.
  • సంతానం వద్దనుకున్న నూతన దంపతులు గర్భం వస్తుందేమోనన్న భయంతో రతిలో పాల్గొనటం కూడా సమస్యకు దారితీయవచ్చు.

పరిష్కారాలు

  • స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ ( రతిలో పాల్గొంటూ, ఇక.. వీర్యం విడుదల అవుతుంది అనిపించగానే స్ట్రోక్స్ ఆపి 1 నిమిషం తర్వాత మళ్ళీ మొదలు పెట్టటం) , స్క్వీజ్ టెక్నిక్‌ ( వీర్యం విడుదల అవుతుంది అనిపించగానే స్ట్రోక్స్ ఆపి అంగపు ముందుభాగాన్ని కొన్ని సెకన్ల పాటు వేళ్ళతో నొక్కి పెట్టి మళ్ళీ రతిలో పాల్గొనటం) లను అనుసరించడం వల్ల ఉపయోగం ఉంటుంది.
  • శృంగారంలో పాల్గొనే భంగిమను మార్చుకోవటం, భాగస్వామిసహకారం తీసుకోవటం ద్వారా కూడా ఇబ్బందిని తొలగించుకోవచ్చు.
  • వైద్యులను కలిసి కౌన్సెలింగ్ తీసుకొని వారు సూచించిన మందులు వాడుకోవాలి. సమస్యను నిర్లక్ష్యంచేస్తే ఒక్కోసారి అంగస్తంభన సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంది. 

గమనిక:కొంతమందిలో మద్యం సేవించినపుడు ఈ సమస్య ఉండదు. కాని మద్యం ప్రభావం దీర్ఘకాలం లో సెక్స్ సామర్ధ్యాన్ని దెబ్బతీస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE