నడివయసు తర్వాత మనుషుల్లో ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. దీంతో ఎముకల కణాలు పలుచబడి (బోన్ మినరల్ డెన్సిటీ తగ్గుదల) క్రమంగా నశిస్తాయి. ఈ సమస్యనే వైద్యపరిభాషలో 'ఆస్టియోపోరోసిస్’  అంటారు. దీని బాధితుల్లో చిన్న చిన్న దెబ్బలకే వెన్ను, మణికట్టు (రిస్ట్), తుంటి (హిప్స్) ఎముకలు విరుగుతాయి. గతంలో 60 నుంచి 70 ఏళ్ళ వారిలో కనిపించే ఈ సమస్య ఇటీవలి కాలంలో 40 ఏళ్లకే కనిపిస్తోంది. మారిన జీవనశైలి, నీడపట్టున చేసే ఉద్యోగాలు, శారీరక శ్రమ లేకపోవటం, విటమిన్ డి లభ్యత తగ్గటం, వ్యాయామం చేయకపోవటం వంటి అంశాలే దీనికి ప్రధాన కారణాలు. ఈ సమస్య బారినపడిన వృద్ధులు సైతం పైకి చూసేందుకు ఆరోగ్యవంతులుగా కనిపిస్తారు గానీ తగు పరీక్షలు చేయించుకుంటే గానీ ఇబ్బంది బయటపడదు. ప్రతి 100 మంది వృద్ధుల్లో 80 శాతం మందిలో ఎముకలు విరగటానికి ఈ సమస్యే కారణం.మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రోజన్ హర్మోన్ ఉత్పత్తి నిలిచిపోవటం,పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లో ఎముకపుష్టి తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల పురుషులతో పోల్చినప్పుడు మహిళల్లో దీని బాధితులు ఎక్కువ.తగు జాగ్రత్తలు పాటించటం ద్వారాఈ సమస్యను నివారించటం, వీలున్నంత ఆలస్యం చేయటం సాధ్యమవుతుంది. 

లక్షణాలు

అకారణంగా వచ్చే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరగడం 

కారణాలు

 • కాల్షియం లేమి , విటమిన్ డి లభ్యత తగ్గటం
 • అధిక బరువు, వ్యాయామం లేకపోవటం
 • మితిమీరిన మద్యపానం, ధూమపానం
 • కొన్ని ఔషధాల వినియోగం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు 

పరీక్షలు

ఈ సమస్య ఉందని వైద్యులను సంప్రదించినప్పుడు 'బోన్ మినరల్ డెన్సిటీ ఎస్టిమేషన్'అనే పరీక్ష చేసి సమస్య తీవ్రతను అంచనా వేస్తారు. ఇంకా ఎక్స్‌రేలు, రక్తపరీక్షలు కూడా అవసరం కావచ్చు. 

జాగ్రత్తలు

 • సాయంత్రం కనీసం 30 నిమిషాలు ఎండలో తిరగాలి. దీనివల్ల విటమిన్ డి లోపం తలెత్తకుండా చూసుకోవచ్చు.
 • రోజువారీ ఆహారంలో కాల్షియం ఉండే పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
 • తగిన ఆహార, వ్యాయామ నియమాలు పాటించి అధికబరువును తగ్గించుకోవాలి.
 • మద్యపానం, ధూమపానం మానుకోవటం మంచిది.
 • అధిక బరువులు మోయటం, కష్టమైన వ్యాయామం చేయటం, హైహీల్స్ వాడటం మానాలి.
 • వృద్దులు చేతి కర్ర వాడాలి.
 • స్నానాల గదుల్లోని నేల సమతలంగా, గరుకుగా ఉండేలా చూసుకోవాలి.Recent Storiesbpositivetelugu

మహిళా.. సాగిపో

"మహిళల స్థితిగతులు బాగుపడనిదే సమాజం అభివృద్ధి చెందదు. ఏ పక్షీ ఒకే రెక్కతో ఎగరలేదు." – స్వామి వివేకానంద.

MORE
bpositivetelugu

ధర్మమే సుగుణాభిరాముని మార్గం

తన సుగుణాలతో, సుపరిపాలనతో ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి శ్రీరాముడు. ఆ జగదభిరాముని జన్మదినమే శ్రీరామనవమి.

MORE