నిద్ర పోయేటప్పుడు తప్ప క్షణం తీరిక లేకుండా పని చేసే నేత్రాలు చెప్పలేనంత అలసి పొతాయి. ఇలా అలసిన కళ్ళకు విశ్రాంతిని అందించే  కొన్ని సులభంగా చేసుకోదగిన కంటి వ్యాయామాల గురించి తెలుసుకుందాం.

 

కప్పింగ్ః   అరచేతులతో అయిదు నిమిషాల పాటు కళ్ళు మూసి అర చేతులతో సున్నితంగా అద్ది వదిలేసి  అయిదారు సెకన్ల తర్వాత మళ్ళీ ఇలాగే చేయాలి. ఇలా అయిదారు సార్లు చేయటం వల్ల ఒత్తిడి దరి చేరదు.

ఫోకస్: బంతిని దారంతో కట్టి వేలాడ దీసి అటూ ఇటూ ఊపుతూ చూపును బంతి మీదే నిలపాలి. ఇలా కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి చూడటం వలన కళ్ళు ఏంటో విశ్రాంతిని పొందుతాయి.

 

డార్క్ రూమ్: మసక మసక గా ఉన్న గదిలో బంతుల నుంచి బఠాణీల వరకు వేరు వేరు సైజున్న వస్తువులను విసిరి, అయిదు నిమిషాల టైం పెట్టుకుని ఏరాలి. ఎవరు ఎక్కువ ఏరితే వారికి అంత ఏకాగ్రత వున్నట్టు. దీనిని  రోజూ సాధన చేస్తే  కంటి చూపుతో బాటు ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

 ఐ డాన్సు: కథక్, కూచిపూడి వంటి నాట్యాలలో ఆయా సందర్భాలను బట్టి కళాకారులు కళ్ళను రకరకాలుగా తిప్పుతుంటారు. ఐ డాన్సు అంటే ఇదే. ముందుగా కుడి నుంచి నుదుటి మీదకు, ఆ తర్వాత ఎడమ వైపుకు, చివరగా కిందికి చూస్తూ  గంటకు కనీసం రెండు సార్లు చేయటం వల్ల కంటిచూపు ఎంతో మెరుగు పడుతుంది.

కంప్యూటర్ ఫై పని చేసే వారికి : రోజుకు పదేసి గంటల పాటు కంప్యూటర్ మీద పని చేయతం తో బాటు స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల ఇప్పటి రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తలనొప్పితో బాటు పలు కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని  నివారించాలంటే ప్రతి గంటకు ఒక సరి కుర్చీలోంచి లేచి బయటకు నాలుగడుగులు వేయటం, పచ్చని చెట్టు చేమలను చూడటం ఎంతైనా అవసరం. కంప్యూటర్ డెస్క్ టాప్ మీద కంటికి ఇంపుగా ఉండే ప్రకృతి దృశ్యాలను ఉంచాలి. ఇలా చేయటం వల్ల కంటికి హాయిగా అనిపిస్తుంది.

 

పెన్సిల్ వ్యాయామం: బాగా మొనదేలిన పెన్సిల్ను అరచేతిలో పట్టుకుని చేతిని చాచి ముఖానికి ఎదురుగా ఉంచి మొన వైపే చూస్తూ, నెమ్మదిగా ముక్కు వరకు తీసుకు రావాలి. ముక్కు దగ్గరికి పెన్సిల్ వచ్చే కొద్దీ అది రెండుగా కనిపిస్తుంది. పెన్సిల్ తిరిగి ఒకటిగా కనిపించేవరకు చూపును పెన్సిల్ మొన మీదే కేంద్రీకరించాలి. ఇలా రోజుకు పది, పదిహేను సార్లు చేయటం వల్ల కంటికి ఎంతో ఉపసమనం కలుగుతుందిRecent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE