నవ్వు ఒక వరం. అయితే నోటి దుర్వాసన మూలంగా ఎంతోమంది ఈ వరానికి దూరమవుతుంటారు. నోటి దుర్వాసన సమస్యను వైద్యపరిభాషలో 'హాలిటోసిస్' అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో చాలామందికి ఎవరైనా చెబితే తప్ప తమకు ఈ ఇబ్బంది ఉన్నట్లు తెలియదు. అయితే నోటి శుభ్రత విషయంలో కొద్దిపాటి శ్రద్ధ, అవగాహన ఉంటే సులభంగా ఈ సమస్యను నివారించవచ్చు. ఈ సమస్య బాధితులు వృత్తిపరమైన, సామాజిక సంబంధాలకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది గనుక వారు సమస్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 

కారణాలు

  • రోజూ నోటిని సరిగా శుభ్రం చేసుకోకపోవడం,
  • దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు, నోటిలో పుండ్లు
  • రోజూ ఉల్లి, వెల్లుల్లి, మాంసం, చేపలు ఎక్కువగా తినడం,
  • మద్యపానం, ధూమపానం
  • అసిడిటీ, సైనస్ ఇన్ఫెక్షన్ 

నివారణ

  • రోజూ నిద్ర లేవగానే, పడుకోబోయే ముందు పళ్లు తోముకోవాలి.
  • భోజనం చేసిన ప్రతిసారీ నోరు నీటితో బాగా పుక్కిలించాలి.
  • టంగ్‌క్లీనర్‌తో నాలుక పైన శుభ్రం చేసి వదిలేయకుండా , వేలితో చిగుళ్లు, నాలుక పక్క, దిగువ భాగాల్ని శుభ్రం చేసుకోవాలి.
  • విరిగిన దంతాలు, పిప్పి పళ్ళు, చిగుళ్లపై పుళ్లు ఉంటే డెంటిస్ట్‌ను కలిసి సలహా కోరాలి.
  • అజీర్తి, గ్యాస్ సమస్య, సైనస్, టాన్సిల్స్, మధుమేహం వంటి సమస్యలు ఉంటే తగు చికిత్స తీసుకోవాలి. 

చికిత్స

నోటి దుర్వాసనకు తగిన కారణాన్ని కనుగొని దానికి చికిత్స తీసుకోవాలి. దంతాలు విరిగి ఆ సందుల మధ్య ఆహారం చేరి దుర్వాసనకు కారణమైతే డెంటిస్ట్‌ను కలిసి ఫిల్లింగ్ చేయించుకోవటం, దంతాలపై గార చేరితే స్కేలింగ్, దంతమూలాలకు ఇన్ఫెక్షన్ సోకితే రూట్‌కెనాల్ వంటి చికిత్స, లేజర్ చికిత్సలు చేయించుకోవాలి. చిగుళ్ల వ్యాధులున్నవారు లేజర్ చికిత్సను ఆశ్రయించటం మంచిది.Recent Storiesbpositivetelugu

మేలైన ఆరోగ్యానికి ఈ యాప్స్‌ వాడాల్సిందే ..!

ఇప్పటి రోజుల్లో ఎవరిచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. దీంతో పలు అవసరాలకు పనికొచ్చే యాప్స్ వినియోగం 

MORE
bpositivetelugu

ముక్తిసాధనకు గీతామార్గం

 భగవంతుడైనశ్రీకృష్ణుడు భక్తుడైనఅర్జునునుకి బోధించిన ఉపదేశసారమే భగవద్గీత. జీవితంలోఎదురయ్యే ప్రతి సమస్యకూ గీత 

MORE