చలికాలంలో విజృంభించే ప్రాణాంతక వైరస్ లలో స్వైన్‌ఫ్లూ ప్రధానమైనది. ఇతరులతో పోల్చినప్పుడు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, గర్భిణులు, టీబీ వంటి శ్వాశకోశ సమస్యలతో బాధపడేవారు సులభంగా దీని బారిన పడతారు. పురుషులతో పోల్చితే మహిళలకు దీని ముప్పు ఎక్కువ. ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రాంతంలో ఈ వైరస్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరూ స్వైన్‌ఫ్లూ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి.

లక్షణాలు

స్వైన్‌ఫ్లూ వైరస్ సోకిన వారిలో ముందుగా జలుబు, విపరీతమైన తుమ్ములు, ముక్కు కారటం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, తేలికపాటి జ్వరం ఉంటాయి.ఈ దశలోనే వైరస్ పరీక్షలు చేయించుకొని ఒకవేళ వైరస్ సోకితే తగు చికిత్స తీసుకోవటం వల్ల వైరస్ బలపడకుండా నివారించవచ్చు. లేనిపక్షంలో ఇది రెండో దశకు చేరుతుంది. ఈ దశలో కొద్దికొద్దిగా జ్వరం పెరుగుతుండటం, ఒళ్లు నొప్పులు, దగ్గు పెరగడంతో బాటు స్వల్పంగా ఆయాసం వంటి లక్షణా లుంటాయి. కనీసం ఈ దశలోనైనా చికిత్స తీసుకుంటే కొద్దిపాటి ఇబ్బందితో బయటపడొచ్చు. లేని పక్షంలో ఇది ప్రమాదకరమైన మూడవ దశకు చేరుతుంది. ఈ దశలో తీవ్రమైన జలుబుగ మారి గుక్కతిప్పుకోలేనంత ఆయాసం వస్తుంది. దీనితో బాటు ఛాతీలో కొద్దిగా నొప్పి , రోగ నిరోధకత తగ్గిపోవడం వంటి మార్పులు వస్తాయి. ఈ దశలో అత్యవసర ప్రాతిపదికన వైద్యసాయం అందకపోతే ప్రాణాపాయం తప్పదు. 

నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలు

ఈ సీజన్లో ఈ దిగువ జాగ్రత్తలు పాటించటం ద్వారా స్వైన్‌ఫ్లూ వైరస్ సోకకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

  • శీతలపానీయాలు తాగొద్దు.
  • చల్లటి వాతావరణంలో ఎక్కువ సేపు తిరగొద్దు.
  • బయటకు వెళ్లే సమయంలో ముక్కుకు మాస్క్, గుడ్డ కట్టుకోవటం తప్పనిసరి.
  • ప్రయాణాలు తగ్గించుకోవాలి. జాతరలు, యాత్రల వంటి ప్రాంతాలకు అసలే పోవద్దు.
  • వంట, భోజనానికి ముందు, మలమూత్ర విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.
  • ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
  • వైద్యం కోసం తప్ప ఆస్పత్రులకు వెళ్లకపోవడం ఉత్తమం.
  • పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రుమాలు వాడాలి.
  • వేడి వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి.
  • జలుబు ఉన్నవారిని వెచ్చని, ప్రత్యేక గదిలో ఉంచాలి.
  • ఏమాత్రం అనుమానంగా ఉన్నా వైద్య సలహా కోరాలి.



Recent Stories







bpositivetelugu

మల్లెలతో మేలైన మానసిక ఉల్లాసం 

ఈ సీజన్లో లభించే పుష్పాలలో మల్లెలదే అగ్రస్థానం. మల్లెల పరిమళాలకు లోనుకానివారుండరు. మల్లెమొగ్గలు చూడగానే మహిళల కురులు దాసోహం

MORE
bpositivetelugu

అన్నదానం ఎందుకు?

   పలు సందర్భాల్లో చాలామంది అన్నదానము చేయటం మనం చూస్తుంటాం. అయితే అసలు అన్నదానం ఎందుకు చేయాలి? అనే 

MORE