జీవితాంతం ఇబ్బంది పెట్టే జీవనశైలి రోగాల్లో మధుమేహం ప్రధానమైనది. అయితే.. చక్కని జీవనశైలి మార్పులు , సమస్య పట్ల సమగ్ర అవగాహనతో మధుమేహాన్ని సంపూర్ణంగా అదుపు చేయవచ్చు. ఇందుకోసం నిపుణులు కొన్ని జాగ్రత్తలను సూచిస్తున్నారు. అవి..

  • పరిమితికి మించి బరువు పెరిగేకొద్దీ మధుమేహం ముప్పు ఎక్కువవుతుంది. అందుకే మధుమేహులు నెలకోసారి తప్పక బీఎంఐ (ఎత్తుకు తగ్గ బరువు) పరీక్షించుకోవాలి. ఊబకాయలు ఈ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ బరువును తగ్గించే కొద్దీ మధుమేహం కూడా అదుపులోకి వస్తుందని వీరు గుర్తించాలి.
  • మధుమేహులు ఏ పనీ చేయకుండా కూర్చోనేకొద్దీ సమస్య ముదురుతుంది. అందుకే వీరు ఎంతోకొంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల జీవక్రియలు మెరుగై మధుమేహం దారికొస్తుంది. ముఖ్యంగా నీడపట్టున పనిచేసే మధుమేహులు, కుటుంబ సభ్యులకు మధుమేహం ఉన్న యువత ముందు నుంచే రోజూ గంటపాటు వ్యాయామం చేస్తుంటే మధుమేహం రావటం ఆలస్యం కావటమే గాక వచ్చినా అదుపులో ఉంటుంది.
  • మధుమేహులు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఎర్ర మాంసం, అధిక క్రొవ్వుగల పదార్థాలకు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా వారు తేలికగా జీర్ణమయ్యే ఆకుకూరలు, కూరగాయలు, చేపలు, తృణ ధాన్యాలు తీసుకోవచ్చు.
  • మధుమేహులు... అందునా ఇన్సులిన్ వాడేవారు రోజూ ఎంతోకొంత దాల్చిన చెక్క పొడిని తీసుకోవటం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి సమస్య త్వరగా దారికొస్తుంది.
  • మధుమేహులు చక్కెర వాడొద్దు. టీ, కాఫీ ల స్థానంలో గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగటం మంచిది.
  • ఒత్తిడి పెరిగే కొద్దీ మధుమేహం పెరుగుతుంది గనుక ఒత్తిడికి అధిగమించేందుకు యోగా, ప్రాణాయామం వంటివి సాధన చేయాలి.
  • మధుమేహులు పిండి పదార్థం ఎక్కువగా ఉండే మైదా వంటకాలు, అన్నం తినే బదులు జొన్న, సజ్జ, రాగి పిండితో చేసే రొట్టె వంటివి ఆకుకూరతో తీసుకోవటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.
  • మధుమేహులు రోజూ ఫాస్ట్ ఫుడ్స్ తింటే ఇన్సులిన్ ప్రభావం తగ్గి మధుమేహం అదుపుతప్పుతుంది. అందుకే వీరు ఫాస్ట్ ఫుడ్ బదులు డ్రై ఫ్రూట్స్, పచ్చి కూరగాయలు,పండ్ల సలాడ్, ఇంట్లో చేసే వంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • పీచు బొత్తిగా లేని పాలిష్ బియ్యం, మైదా, మిఠాయిలకు బదులు ముడి బియ్యం,ఓట్స్, పొట్టు తియ్యని ధాన్యాలు, ఆకుకూరలు వంటి పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకొనేవారికి మధుమేహాన్ని కట్టడిచేయటం సులభం.
  • మధుమేహులలో గాయలయితే త్వరగా మానవు. అందుకే వీరు పాదాల సంరక్షణ మీద ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఇందుకోసం ప్రత్యేకమైన మెత్తని చెప్పులు వాడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE