ఈ రోజుల్లో చిన్న వయసు వారు సైతం కిడ్నీరాళ్ల సమస్యతో బాధపడటం చూస్తున్నాం. రక్తములోని వ్యర్థాలను కిడ్నీలు వడకట్టి మూత్రం రూపంలో విసర్జించలేకపోయినప్పుడు ఆ వ్యర్ధాలు కిడ్నీరాళ్లుగా మారతాయి. సాధారణంగా రక్తంలో కాల్షియం, ఫాస్పేటు, యూరిక్ యాసిడ్ లవణాల వల్ల ఇవి ఏర్పడతాయి. కొన్నిసార్లు మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ కూడా వీటికి కారణం కావచ్చు. ఈ రాళ్లు కిడ్నీతో బాటు మూత్ర నాళము, మూత్రాశయాల్లో సైతం ఏర్పడే ముప్పు ఉంటుంది. మహిళలతో పోల్చితే ఇవి పురుషులలో ఎక్కువగా ఏర్పడతాయి. తగిన అవగాహన, ఆరోగ్యం పట్ల రవ్వంత శ్రద్ధ కనబరిస్తే కిడ్నీరాళ్లను పూర్తిగా నివారించవచ్చు.

లక్షణాలు

 • వీపు కింది భాగంలో నొప్పి, ఇది క్రమంగా పొత్తికడుపు, జననాంగాల వైపు వ్యాపించటం,
 • వాంతి వచ్చినట్లు అనిపించటం, కావడం
 • మూత్రం పోస్తున్నప్పుడు నొప్పి, మంట, మూత్రంలో రక్తం పడటం
 • పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాలనిపించటం, ఆ సమయంలో భయంగా ఉండటం
 • కాళ్ళు, ముఖం వాపు,
 • మూత్రంలో ఆల్బుమిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా పోవటం
 • అధిక రక్త పోటు, శ్వాస దుర్వాసన, ఒళ్ళు దురద పుట్టడం

ఇవీ కారణాలు

 • కిడ్నీ సంబంధిత వ్యాధులు దీర్ఘకాలం కొనసాగటం
 • అదుపుతప్పిన అధిక రక్త పోటు, మితిమీరిన మధుమేహం
 • అధిక బరువు, అనారోగ్యకర జీవన శైలి
 • కిడ్నీ రాళ్ళు, కణుతులు, గడ్డలు,
 • ప్రోస్టేట్ గ్రంధి పెరిగి మూత్ర సరఫరా ఆగటం
 • మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వినియోగం, లోహ సంబంధ భస్మాలు వాడటం

వైద్య పరీక్షలు

పై లక్షణాలున్న వారు నెఫ్రాలజిస్టులను సంప్రదించి వారు సూచించైనా మేరకు అల్ట్రాసౌండు, ఎక్స్ రే, ఎంఆర్.ఐ , రక్త, మూత్ర పరీక్షలు చేయించాల్సి రావచ్చు. ఈ పరీక్షల్లో మూత్ర వ్యవస్ధ ఇన్ ఫెక్షను, మూత్రనాళాలు మూసుకుపోవడం, మూత్రపిండాల సామర్ధ్యం, వంటి సమస్యలుంటే సులభంగా బయటపడతాయి.

నివారణ

 • ఆహారంలో క్యాల్షియం మోతాదు తగ్గించడం, ఆక్సలేట్లు అధికంగా ఉండే చాక్లెట్లు, పాలకూర, టమాట, బీట్‌రూట్, స్ట్రాబెర్రీ తగ్గించాలి.
 • ఆరోగ్యవంతులు రోజుకు 3.5 లీటర్ల నీళ్ళు తాగితే చాలు. కానీ, కిడ్నీరాళ్ళ బాధితులు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగవలసి ఉంటుంది. అతిగా టీ, కాఫీలు, మరీ చల్లని నీరు, కూల్ డ్రింక్స్ తీసుకోరాదు.
 • క్యాల్షియం రాళ్ళు ఉన్న వారు ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి.

ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి.

చికిత్స

కిడ్నీ రాళ్లను నిర్లక్ష్యం చేస్తే, వాటి సైజు పెరిగి మూత్ర విసర్జనకు అడ్డంకిగా మారతాయి. ఒక్కోసారి మూత్ర నాళం సన్నగా మారడం, ఇన్‌ఫెక్షన్లు రావడం, ఒక్కోసారి క్యాన్సర్ వ్యాధికి కూడా ఇవి దారితీయవచ్చు. కిడ్నీ రాళ్ళను ముందుగానే గుర్తించగలిగితే కేవలం మందులు, జీవనశైలి మార్పులతో వాటిని కరిగించవచ్చు. సమస్య ముదిరేకొద్దీ సర్జరీ అవసరం అవుతుంది.అందుకే ముందునుంచీ వైద్యపరీక్షలు చేయించుకొని వైద్యులు సూచించిన చికిత్స తీసుకోవాలి.  Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE