వేసవి వచ్చేసింది. ఈ రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బ ముప్పు పొంచివుంటుంది. వడదెబ్బ తగిలినప్పుడు శరీరంలో నీరు హరించుకుపోయి ఊష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో జీవ కణాలు చనిపోయి జీవక్రియలు దెబ్బతిని..క్రమంగా శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించుకొనే శక్తిని కొల్పోతుంది. ఈ సందర్భంలో మనిషి సృహ కోల్పోవటం, పరిస్థితి విషమిస్తే ప్రాణాపాయం కూడా సంభవించొచ్చు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, ఊబకాయలు, మద్యం తాగేవారు, వృధ్దులు, గుండె జబ్బులున్నవారు, ఎండలో తిరిగి విధులు నిర్వహించే సిబ్బంది ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. కారణాలు ఏమైనా వడదెబ్బకు గురైన వ్యక్తికి ముందుగా ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రిలో చేర్చి తగిన చికిత్స ఇప్పించాలి.

లక్షణాలు

వడదెబ్బతగిలిన వ్యక్తికీ విపరీతమైన జ్వరం, కండరాలు బిగదీసుకుపోవటం, వణుకు, భరించలేని తలనొప్పి, పొట్టలో వికారం, నీరసంగా ఉండటం, సృహతప్పటం, చర్మం కందిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, వింతగా ప్రవర్తించడం, లోబీపీ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రథమచికిత్స

ఎండలో పడిపోయిన వడదెబ్బ బాధితుడిని ముందుగా నీడలోకి చేర్చి చల్లటి నీళ్లలో ముంచిన బట్టతో ఒంటిని తుడవాలి. వీలుంటే చల్లని బట్ట మీద పడుకోబెట్టాలి. శ్వాస తీసుకోవటం కష్టమైతే బాధితుడి నోటిలో నోరు పెట్టి శ్వాసను అందించాలి. శరీరాన్ని ప్రతి 10 నిమిషాలకోసారి తడిగుడ్డతో తుడవాలి. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ చేసేందుకు కొత్తిమీర వేసిన మజ్జిగ, పుదీనా, నిమ్మరసం, పండ్లరసాలు, కొబ్బరి నీళ్ళు,మొదలైనవాటిని కొద్దికొద్దిగా తాగించాలి. పరిస్థితి కుదుట పడగానే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సలహా కోరాలి. 

ముప్పు తప్పాలంటే..

  • మధ్యాహ్నం ఎండలో తిరగొద్దు. పనులేమైనా ఉంటే ఉదయం, సాయంత్రం చూసుకోవాలి.
  • మధ్యాహ్నం తప్పక ఎండలో వెళ్ళవలసి వస్తే గొడుగు వేసుకొని వెళ్లటంతో బాటు చెవులు, ముక్కు, తలను కప్పేలా మెత్తని బట్టను కట్టుకోవాలి. వెంట మంచినీళ్ల సీసా తీసుకెళ్ళాలి.
  • వేసవిలో మెత్తని నూలు దుస్తులు వాడాలి. లేత రంగులే వాడాలి. దుస్తులు ఒంటిని పూర్తిగా కప్పేలా చూసుకోవాలి.
  • చల్లని నీటితో స్నానం చేయాలి. వేసవిలో దప్పకయ్యేవరకు ఆగకుండా తరచూ నీరు తాగాలి. మధ్య మధ్యలో కొబ్బరినీరు, పండ్ల రసాలు తీసుకోవాలి.
  • వేసవిలో పెరుగుకు బదులు రెండుపూటలా నిమ్మరసం కలిపిన మజ్జిగ వాడుకొంటే మంచిది.
  • పగటిపూట పుచ్చ, కీరా, ఆకు కూరలు, ఖర్బూజ, రాగి జావ వంటివి తీసుకొంటే వడదెబ్బ ముప్పు ఉండదు.
  • వేసవిలో పగటిపూట దూర ప్రయాణాలు పెట్టుకోవద్దు. ద్విచక్ర వాహన దారులు తప్పక హెల్మెట్ వాడాలి.
  • ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE