వేసవిలో మండే ఎండలకు, సతమతం చేసే ఉక్కపోతకు చెమటకాయలు రావటం సహజమే. చికాకు పెట్టే ఈ సమస్యను భరించటం కాస్త కష్టమే. ముందునుంచే రోజుకో గ్లాసు చెరుకు రసం తాగటం వంటి మార్గాల ద్వారా ఒంటిని వీలున్న మేరకు చల్లగా ఉంచుకొంటే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. అయితే.. కొందరిలో శరీరతత్వం వంటి కారణాల వల్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా ఇవి వస్తూనే ఉంటాయి. అలాంటివారు ఈ చిట్కాలు పాటిస్తే చెమటకాయల సమస్యకు వీలున్నంత త్వరగా చెక్ పెట్టొచ్చు . అవి.. 

  • మెత్తని బట్టలో ఐసు ముక్కలు పెట్టి చెమటకాయలు మీద 10 నిమిషాలపాటు అద్దితే (రోజుకు 3 సార్లు) 2 రోజుల్లో సమస్య తగ్గిపోతుంది. 
  • గంధం పొడి , రోజ్‌వాటర్‌ సమపాళ్లలో కలిపి చెమటకాయల మీద రాసి ఆరాక చల్లని నీళ్లతో కడిగితే అవి 2 రోజుల్లో మాయమవుతాయి.
  • కప్పు చల్లని నీళ్లలో చెంచా బేకింగ్‌ సోడా కలిపి మెత్తని బట్టను ఆ నీటిలో ముంచి పిండి చెమటకాయలపై 10 నిమిషాలు ఉంచితే మంట, దురద తగ్గుతాయి.
  • ముల్తానిమిట్టి, రోజ్‌వాటర్‌ కలిపి లేపనంగా చేసి చెమటకాయల మీద రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగినా చెమటకాయలు సమసిపోతాయి.
  • వేప చిగుళ్ళ గుజ్జును లేదా వేపముద్దకు, కొద్దిగా శనగపిండి,నీరు చేర్చి చెమటకాయలున్న చోట ఆరాక చల్లని నీటితో కడిగేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
  • చెమటకాయలున్న చోట పుచ్చకాయ గుజ్జు లేదా కలబంద గుజ్జు పూసి ఆరాక కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  • వేపనూనె, కర్పూరాన్ని కలిపి రంగరించి చెమటకాయలున్న చోట రాసి ఆరాక కడిగేస్తే సమస్య దారికొస్తుంది.
  • చెమటకాయల వల్ల కలిగే దురద, మంట పోవాలంటే . ఓట్స్ పిండిని స్నానపు తొట్టి నీటిలో కలిపి అరగంటపాటు ఆ చల్లనినీటిలో మునగాలి. తర్వాత మెత్తని తువ్వాలుతో ఒళ్ళు తుడుచుకోవాలి. ఇలా వారానికి 2 మార్లు చేస్తే సమస్య ఉపశమిస్తుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE