వానాకాలం, శీతాకాలాల్లోనే బాధించే రుగ్మతల్లో సైనసైటిస్ ఒకటి. మారుతున్న వాతావరణ మార్పులతోపాటు జీవనశైలి కారణంగా ప్రస్తుతం వేసవిలో కూడా సైనసైటిస్‌ బాధితుల సంఖ్యా పెరుగుతోంది. సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే అలర్జీ తత్వం ఉన్నవాళ్లనే ఈ సైనసైటిస్‌ ఎక్కువగా బాధిస్తుంది. అయితే ఈ వేసవిలో కొన్ని జాగ్రత్తలు పాటించటం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా చూసుకోవచ్చు. అవి..

  • ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్సులు, జాతరల వంటి రద్దీ ప్రదేశాల్లో తిరిగితే క్రాస్‌ ఇన్‌ఫెక్షన్స్‌ సోకే ప్రమాదం ఎక్కువ. కనుక ఇలాంటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు మాస్క్ ధరించటం మంచిది. సినిమా హాళ్లు, కళ్యాణ మంటపాల వంటి చోట సైతం ఈ ముప్పు ఉంటుంది.
  • వేసవిలో కూలర్లో నింపిన నీటిని ఎప్పటికప్పుడు మార్చకపోవటం వల్ల ఆ నీరు కలుషితమై ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది . అలాగే కూలర్‌ మ్యాట్స్‌లో చేరిన ఫంగస్‌ మూలంగా కూడా ఫంగల్‌ సైనసైటిస్‌ వస్తుంది.
  • వేసవిలో ఎండా ధాటికి ఏసీ ఉష్ణోగ్రతను 17 లేదా 18 డిగ్రీలకు తగ్గించుకుంటే వాతావరణం చల్లబడి ముక్కులు బిగదీసి జలుబు చేసి , ఈ సాధారణ జలుబే క్రమముగా సైనసైటిస్‌గా మారొచ్చు. కనుక ఏసీ ఉష్ణోగ్రతను 25 డిగ్రీల వద్ద పెట్టుకోవటం మంచిది.
  • వేసవిలో వృత్తిరీత్యా లేదా సెలవుల పేరిట కొత్త ప్రదేశాల్లో తిరగటం వల్ల కూడా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే ముప్పు ఉంటుంది. అందుకే.. అలర్జీ బాధితులు వేసవి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది.
  • ఎలర్జీ తత్వం ఉన్నవాళ్లు వేసవిలో కూల్‌డ్రింక్స్‌, ఫ్రిజ్ లో పెట్టిన నీరు ఎక్కువగా తాగటం వల్ల అలర్జిక్‌ రైనైటిస్‌, అలర్జిక్‌ సైనసైటిస్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కనుక వీటి జోలికి పోకుండా ఉండాలి.
  • సముద్ర, నదీ తీర ప్రాంతాలలో వాతావరణంలో తేమ ఎక్కువ. దాంతో అలర్జీలు సులభంగా వ్యాపిస్తాయి. అందుకే అలర్జీ బాధితులు వేసవిలో ఇలాంటి ప్రాంతాలకు దూరంగా ఉండటంతో బాటు ఒకవేళ అక్కడికి వెళ్లినా ఎండలో తిరగటం తగ్గించుకోవాలి.
  • వేసవిలో అప్పుడప్పుడూ కురిసి పోయే వానల మూలంగా వాతావరణంలో వచ్చే అవాంఛిత మార్పు సైతం సైనసైటిస్ కు కారణం కావచ్చు . అందుకే వర్షం కురిసే సమయంలో, మరునాడు బయట తిరగకుండా జాగ్రత్త పడాలి.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE