వేసవి సెలవులకు సమయం ఆసన్నమైంది. సుమారు 2 నెలల పాటు కొనసాగే ఈ సెలవుల్లో చిన్నారులు అన్నీమరచి ఆటపాటల్లో మునిగితేలుతారు.ఈ క్రమంలో మండే ఎండల్ని, ఉక్కపోతలను అస్సలు లెక్కచేయరు. దీనివల్ల పిల్లలు వేసవి సెలవుల్లో పలు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. అందుకే.. తల్లిదండ్రులు చిన్నారుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులకు ఈ వేసవి మధురానుభూతిగా మిగలాలంటే పెద్దలు తప్పకుండా ఈ దిగువ అంశాల మీద దృష్టి పెట్టాలని వారు చెబుతున్నారు.

ప్రధాన సమస్యలు.. పరిష్కారాలు  

  • ఆటల్లో పడిపోయిన తర్వాత పిల్లలు లోకాన్ని పట్టించుకోరు. ముఖ్యంగా క్రికెట్, ఫుట్ బాల్ వంటి ఆటలు పూర్తయ్యేందుకు గంటల వ్యవధి పడుతుంది. ఒకవైపు ఎండ, ఉక్కపోత వల్ల తీవ్రమైన అలసటకు గురయ్యే పిల్లలు చాలినంత నీరు తాగకపోతే సులభంగా వడదెబ్బ బారిన పడతారు. బలహీనంగా ఉన్నపిల్లల్లో ఫిట్స్‌ కూడా రావచ్చు. అందుకే.. ఎండవేళ పిల్లలు బయట ఆడకుండా పెద్దలు చూడాలి. ఆ సమయంలో కథలు, పాటలు, పుస్తకాలు చదివటం, బొమ్మలు సాధన చేయటం, సినిమాల వంటి వ్యాపకాలతో సమయం గడిపేలా చూస్తే ఎండ ముప్పు తప్పినట్లే.
  • తమతమ వ్యాపకాల్లో పడిన పిల్లలు తగినంత నీరు తాగకపోతే డీహ్రైడేషన్‌ బారినపడతారు. దీనివల్ల యూరిన్ ఇన్‌ ఫెక్షన్‌, కిడ్నీ సమస్యలు రావచ్చు. అందుకే దాహంతో నిమిత్తం లేకుండా ప్రతి అరగంటకోసారి కొద్దోగొప్పో నీరు తాగేలా చూడాలి. మధ్యమధ్యలో పండ్లరసాలు, మజ్జిగ, జావ,కొబ్బరినీరు, నిమ్మరసం వంటివి ఇవ్వాలి. 
  • వేసవిలో ఎండ వల్ల చెమట పోసి దానికి దుమ్ము తోడై ఒంటికి అతుక్కుపోయి స్వేద గ్రంథులు మూసుకుపోయి శరీరం చల్లబడే ప్రక్రియ దెబ్బతింటుంది. ఆ తర్వాత తిని వడదెబ్బ తగలటం, చెమట పొక్కులు రావటం, ఒక్కోసారి ఆ పొక్కులు ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలుగా మారి నొప్పి, జ్వరం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే పిల్లలు 2 పూటల స్నానం చేయటం, తల్లో చేరిన దుమ్ము పోయేలా 2 రోజులకోసారి తలస్నానం చేయటం, ఆటలు ఆడి ఇంటికిరాగానే కాలంలో కాళ్ళు చేతులూ సబ్బుతో కడుక్కోవటం వంటివి పాటించేలా పెద్దలు చూడాలి. అలాగే వేసవిలో పిల్లలు పలుచటి, మెత్తటి కాటన్‌ బట్టలు వాడేలా చూస్తే ఈ సమస్య సగం తగ్గుతుంది.
  • వేసవిలో ఎండ వేడిమి, వడగాలి మూలంగా ముక్కులు ఎండి పుండ్లు పడతాయి. పిల్లలు ముక్కులో వేళ్ళు పెట్టి తిప్పితే ముక్కునుంచి రక్తం కారే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే పిల్లలు బయటి వెళ్ళేటప్పుడు ముఖానికి గుడ్డ కట్టుకొనేలా చేయటంతో బాటు ముక్కులో వేళ్ళు పెట్టితిప్పటం మాన్పించాలి.
  • వేసవిలో వండిన ఆహారం ఎక్కువ సమయం నిల్వ ఉండదు. పిల్లలు పొరబాటున చెడిపోయిన ఆహారం తింటే వాంతులు, విరేచనాలు తప్పవు. కలుషిత నీరు తాగటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. ఈ ఇబ్బందిని నివారించేందుకు వేడివేడి ఆహారం ఇవ్వటంతో బాటు బయటి వెళ్ళేటప్పుడు నీళ్ళసీసా ఇచ్చి పంపటం మంచిది.
  • కలుషిత నీటితో తయారైన ఐస్ చెరుకురసం, పండ్ల రసాలలో కలిస్తే తీవ్రమైన ఇన్‌ఫెక్షన్లు, కలరా, టైఫాయిడ్‌, కామెర్ల వంటి వ్యాధుల ముప్పు పొంచివుంటుంది. అందుకే.. బయట తాగే పానీయాల్లో ఐస్ లేకుండా చూడటంతో బాటు అక్కడి పరిసరాల పరిశుభ్రతను కూడా పరిగణలోకి తీసుకోవాలి.
  • ఇంట్లో, దుకాణాల్లో ఈగలు వాలిన ఆహారపదార్థాలు పొరబాటున పిల్లలు తిన్నా వేసవిలో సమస్యలు రావచ్చు. ఇంట్లో వంట పాత్రల మీద తప్పక మూతలు పెట్టాలి. వీలున్నమేరకు బయటి ఆహారం జోలికిపోకుండా ఇంట్లోనే రుచికరమైన చిరుతిళ్ళు చేసి పెట్టాలి.
  • ఎండాకాలం కళ్ళకలక ఇన్‌ఫెక్షన్‌ వ్యాపిస్తుంది. దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల ఇది త్వరగా పాకిపోతుంది. కనుక పిల్లలు దానిబారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలి. కళ్ళ కలక ఉన్న పిల్లల్తో కలవకుండా చూడటంతో బాటు ముందు జాగ్రత్తగా పిల్లలకు చలువ కళ్లద్దాలు కొనిస్తే వేడి, దుమ్ము నుంచి కూడా కళ్ళకు రక్షణ లభిస్తుంది.
  • వేసవిలో వచ్చే ఆటలమ్మ, గవద బిళ్ళలు, టైఫాయిడ్‌, పొంగు, హైపటైటిస్‌ 'ఎ' కామెర్ల వంటి సమస్యలు రాకుండా ముందుగా టీకాలు వేయిస్తే పిల్లలకు తగిన భద్రత ఉంటుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE