తాత్కాలిక అనారోగ్య సమస్యల్లో తలనొప్పి ఒకటి. సాధారణంగా ప్రతి 100 మందిలో 60 శాతం మంది తరచూ దీని బారిన పడటం సహజమే. అయితే నరాల సమస్య కారణంగా తరచూ కనిపించే మైగ్రేన్ తలనొప్పి(పార్శ్వపు నొప్పి) మాత్రం మనిషిని అతలాకుతలం చేస్తుంది. ఈ నొప్పి ఉన్నత సేపు బాధితుడు చిన్నపనిని సైతం చేయలేని దుస్థితికి గురవుతాడు.  తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకు పోవడం, ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వలన అక్కడికి అధిక రక్తం ప్రవహించి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. పెద్దల్లో 4 నుంచి 72 గంటల పాటు ఉండే మైగ్రేన్ తలనొప్పి పిల్లల్లో 2 గంటలకంటే తక్కువ సమయం ఉంటుంది. మనిషిని బాగా ఇబ్బంది పెట్టే ఈ సమస్య విషయంలో తగిన అవగాహన ఉన్నప్పుడే దీన్ని గుర్తించటం, నివారించటం సాధ్యమవుతుంది.

లక్షణాలు

ఈ లక్షణాలు 2 దశల్లో కనిపిస్తాయి. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి 8 గంటల వరకు ప్పుడు తరచూ తలనొప్పి రావటం, తేలికగా మొదలయ్యే ఈ నొప్పి క్రమంగా తీవ్రతరం కావటం, వాంతి వచ్చిన భావన, వాంతులతో కూడిన తలనొప్పి, వెలుతురు లేదా శబ్దాలను భరించలేకపోవటం, సాధారణ వెలుతురు కూడా చూడలేకపోవటం ఉంటే దీన్ని మైగ్రేన్ గా అనుమానించాలి. ఈ లక్షణాలు మొదలైన కొద్దిసేపటికి ముఖం, చేయి, కాలు మొద్దుబారటం లేదా సూదులతో గుచ్చినట్లు అనిపిస్తే అనుభూతి కల్గడం, కళ్ళు తిరగడం, బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది, విపరీతమైన తలనొప్పి, తలమీద సుత్తి తో బాదినట్లు అనిపించటం, ఆకలి లేకపోవటం కూడా ఉంటే అది మైగ్రేన్ తలనొప్పి అని నిర్ధారణకు రావచ్చు. బహిస్టు సమయంలో ఇలాంటి తల నొప్పి ఉన్నా అది మైగ్రేన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ.

కారణాలు

మానసిక ఒత్తిడి, భరించలేని తలనొప్పి, శారీరక శ్రమ ఎక్కువకావటం, భరించలేనంత వెలుతురులో పనిచేయటం, మహిళల్లో నెలసరి క్రమములో తేడాలు, గర్బనిరోధక మాత్రల వినియోగం, ధూమపానం, మద్యపానం

మైగ్రేన్‌ రకాలు

క్లాసికల్‌ మైగ్రేన్‌

నూటికి 20 శాతం మైగ్రేన్ కేసుల్లో ఇది కనిపిస్తుంది. దీనికి వయసు, లింగభేదం(స్త్రీ, పురుష భేదం) ఉండదు. కళ్ళముందు తళుక్కుమని మెరిసినట్లు అనిపించటం, చూపు మందగించటం, చేతులు, కాళ్లు, ముఖం, నాలుక, పెదవులు తిమ్మిర్లు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవిపై భాగాన మొదలయ్యే తలనొప్పి తలసగభాగానికి పాకుతుంది. ఒక్కోసారి కుడివైపు కనిపించే ఈ నొప్పి మరొకసారి ఎడమవైపు వస్తుంది. మితిమీరిన మద్యపానం, మానసిక ఒత్తిడి, వాతావరణ మార్పులు ఈ తరహా తలనొప్పికి కారణం అవుతాయి.ఈ సమస్య బాధితులు తగినంత విశ్రాంతి తీసుకోవటం, నిద్ర పోవటం, చీకటి గదిలో పడుకోవటం వల్ల సత్వర ఉపశమనం కలుగుతుంది. 

కామన్‌ మైగ్రేన్‌

ఇది సాధారంగా కనిపించే మైగ్రేన్‌. నడివయసు వారిలో.. ముఖ్యంగా మహిళల్లో కనిపిస్తుంది. కణతలకు రెండువైపులా వచ్చే ఈ నొప్పి ఉన్నప్పుడు కళ్లలో సూదులతో గుచ్చుతున్న నొప్పి ఉంటుంది. ఎక్కువగా కంటి వెనుక నొప్పి కేంద్రీకృతమవుతుంది.

ముప్పును పెంచే అంశాలు 

మానసిక ఒత్తిడి, మితిమీరిన మద్యపానం, నెలసరి, ఒంటిపూట భోజనం, భరించలేనంత కాంతి, పెద్ద పెద్ద చప్పుళ్లు, ఎత్తైన ప్రదేశాలలో ఉండటం, ఘాటైన వాసన, వాతావరణంలో తేమ అధికంగా ఉండటం, నిద్రలేమి, కొన్ని ఔషధాల వినియోగం, తలకు స్వల్పంగా గాయం కావడం వల్ల సమస్య ముప్పు పెరుగుతుంది. పులియబెట్టిన, కాల్చిన ఆహారం, చాక్లెట్, పాల ఉత్పత్తులు, రెడ్ వైన్, చేపలు, బీన్స్ , ధూమపానం, అవకాడో, అరటి,పుల్లని పండ్లు, ఉల్లిపాయలు, వేరు శనగ వంటివి తిన్నప్పుడు ఎలర్జీ వచ్చేవారిలో కూడా మైగ్రేన్ ముప్పు పెరుగుతుంది.

చికిత్స 

మైగ్రేన్ నొప్పికి 2 రకాల చికిత్సలున్నాయి. మొదటిది.. తాత్కాలికంగా, తక్షణం నొప్పిని నివారించే ఔషధాలు వాడటం. దీన్నే అబార్టివ్ ట్రీట్‌మెంట్ అంటారు. ఇది తాత్కాలిక పరిష్కారం. ఇక.. రెండవది.. శాశ్వత ప్రాతిపదికన చేసే దీర్ఘకాలిక చికిత్స. ప్రొఫిలాక్టిక్ ట్రీట్‌మెంట్ గా పిలిచే ఈ విధానంలో ఔషధాలను క్రమపద్ధతిలో డోసులు పెంచుతూ వాడతారు. అయితే.. ముఖం మీది మడతలను తొలగించే బొటాక్స్‌ ను మైగ్రేన్ కు చికిత్సగా వాడుతున్నారు. ఈ విధానంలో తల, మెడ చుట్టూ ఇంజక్షన్స్ ఇస్తారు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE