ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, చిన్నారుల్లో కనిపించే సాధారణ అనారోగ్యాల్లో రక్త హీనత ఒకటి. రోజువారీ ఆహారంలో ఐరన్ లోపించటం వల్ల తక్కువ బరువున్న పిల్లలు పుట్టటం, నెలలు నిండకుండానే ప్రసవించటం, నవజాత సిసువుల్లో ఎదుగుదల లోపాలు, కదలికల్లో మార్పులు ఏర్పడతాయి. ఐరన్ లోపం వాళ్ళ మానసిక ఎదుగుదల లోపాలు, గ్రహణ శక్తీ లోపాలు ఏర్పడతాయి.
ఐరన్
మన శరీరంలో మొత్తం 4 గ్రాముల వరకు ఐరన్ ఉండగా, అందులో 70 శాతం వరకు రక్తంలోనే ఉంటుంది. రక్తంలోని హీమోగ్లోబిన్ తయారీలో ఐరన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోగ నిరోధక శక్తి బాగుండాలన్నా, మెదడు పెరుగుదల, కండరాల పనితీరు సరైన రీతిలో ఉండాలన్నా ఐరన్ అవసరమే . ఈ ఐరన్ శరీరానికి ఆహారం రూపంలోనే అందుతుంది. ఏ కారణం చేతనైనా తగినంత ఐరన్ అందనప్పుడు అది రక్తహీనతకు దారి తీస్తుంది . పిండి పదార్థాలు, చేపలు, ఆకుకూరలు, బెల్లం, చిక్కుళ్ళలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది . మన దేశంలో గర్భిణులలో ఈ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది . అందుకే వీరు ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవాలి .
రక్తహీనత లక్షణాలు