నవ్వాలంటే భయం, గట్టిగా తుమ్మితే తలెత్తుకోలేని పరిస్థితి. పదిమందిలోకి వెళ్లి పట్టుమని గంటసేపు ఉండలేని దుస్థితి. యూరిన్‌ ఇన్‌కాంటినెన్స్‌ (తెలియకుండా మూత్రం పడిపోవడం) సమస్య బాధితుల సమస్య ఇది. నిజానికి ఇది జబ్బు కాదు. జబ్బుకు సంబంధించిన లక్షణం. వృద్ధుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ధూమపానం, స్థూలకాయం, కిడ్నీ వ్యాధులున్నవారికి ఈ  సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ. బాధితుల శారీరక పరిస్థితి, వయసును బట్టి తగిన పరీక్షలు చేసి ఈ సమస్యకు చికిత్స అందించాలి. 

సమస్యకు కారణం

మూత్రాశయం నిండేవరకు అక్కడ మూత్రం నిల్వ ఉంటుంది. ఈ దశలో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. దీన్ని స్ప్రింటర్‌ మెకానిజం అంటారు. ఈ దశలో స్ప్రింటర్‌ బిగుతుగా ఉంటుంది గనుక దగ్గినా, తుమ్మినా, నవ్వినా, మూత్రాశయంపై ఒత్తిడి పడినా మూత్రం రాదు. మూత్ర విసర్జనకు వెళ్ళినప్పుడే స్ప్రింటర్‌ వదులుగా మారి మూత్రం వస్తుంది. అయితే.. స్ప్రింటర్‌ పనితీరు దెబ్బతిని బిగుతుగా మూసుకోలేని సందర్భాల్లో మూత్రాశయం నిండగానే తుమ్మినా, దగ్గినా మూత్రాశయం మీద ఒత్తిడి పెరిగి అక్కడి స్ప్రింటర్‌ మూసుకోకపోవడం వల్ల మూత్రం లీకవుతుంది. 

స్త్రీ పురుషుల్లో వేర్వేరు కారణాలు

సాధారణంగా 30 నుంచి 60 ఏళ్ళ మహిళల్లో ఈ సమస్య రావచ్చు. మహిళల్లో ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది స్ట్రెస్‌ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌. అంటే దగ్గినా, తుమ్మినా కడుపులో పెరిగిన ఒత్తిడిని తట్టుకోలేక మూత్రాశయం ముందున్న స్ప్రింటర్‌ వదులుగా మారి మూత్రం లీకవుతుంది. ప్రసవం తర్వాత పెల్విక్‌ అవయవాల్లో స్ట్రెచ్‌ ఏర్పడి, మూత్రా శయానికి లిగమెంట్ల సపోర్టు తగ్గుతుంది. దీనివల్ల దగ్గడం, తుమ్మ డం వల్ల మూత్రాన్ని ఆపిపెట్టే శక్తి తగ్గటం వాళ్ళ ఈ సమస్య వస్తుంది. రెండోది.. అర్జినరి ఇన్‌కాంటి నెన్స్‌ అంటే స్ప్రింటర్‌ పనితీరు బాగున్నా మూత్రాశయం అతి చురుకుగా ఉండడం వల్ల మూత్రం లీక్ అవుతుంది. ఇక.. పురుషుల్లో శస్త్ర చికిత్సల మూలంగా జరిగి స్ప్రింటర్‌ దెబ్బ తినడం, నడుము విరిగి న్యూరో జెనిక్‌ మూత్రాశయం జరగడం వంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొందరిలో వయసు పెరిగే కొద్దీ మూత్రాశయం పనితీరులో వచ్చే మార్పులు, ప్రొస్టేట్‌ గ్రంథి పెరగడం వల్ల కూడా పదే పదే మూత్రం రావడం, వెళ్లే లోపు బట్టల్లో పడిపోవడం జరుగు తుంది.

చిన్నారుల్లో

కొందరు చిన్నారులకు పుట్టుకతోనే కిడ్నీ, మూత్ర నాళంలోని లోపాలవల్ల ఈ సమస్య వస్తుంది. కొందరు పిల్లల్లో మూత్రం పోసిన తర్వాత కొద్ది కొద్దిగా లీకవుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే ఒకసారి వైద్యుల సలహా కోరటం మంచిది.

చికిత్స

ఈ సమస్య ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదిస్తే ముందుగా అల్ట్రా సౌండ్‌, యూరోడైనమిక్స్‌ వంటి వైద్య పరీక్షల సాయంతో సమస్యకు కారణాన్ని స్పష్టంగా గుర్తించటం సాధ్యమవుతుంది. చాలా సందర్భాల్లో తగిన మందులు, అవసరాన్ని బట్టి సర్జరీ చేయటం ద్వారా ఈ సమస్యను పూర్తిగా అధిగమించవచ్చు.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE