ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆచరించదగిన తేలికైన వైద్య ప్రక్రియే.. ఆయిల్ పుల్లింగ్. దీన్నే ఆయుర్వేద పరిభాషలో గండూష చికిత్స అంటారు. శరీరంలోని వ్యర్ధాలను  తొలగించే ఈ ప్రక్రియను అయిదేళ్ళ వయసు నిండిన ఎవరైనా చేయవచ్చు. రోజూ ఆయిల్‌ పుల్లింగ్‌ చేయటంవల్ల పలు రోగాల నివారణ సాధ్యమవుతుంది. శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు, వేరుశనగ, కొబ్బరి, నువ్వుల నూనెలలో దేనినైనా వాడొచ్చు. దీని సాధనా పద్దతి, అందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఇలా చేయాలి..

ఉదయంపూట పరగడుపున ఆయిల్ పుల్లింగ్ చేయాలి. 2 చెంచాల నూనె నోట్లో పోసుకొని నాలుక సాయంతో దంతాలు, అంగిలి మధ్య వేగంగా పుక్కిలించాలి. ఇలా పది నిముషాలు చేసేసరికి నోట్లో ఊరే లాలాజలం, ఆయిల్ తో కలిసి నీరుగా మారుతుంది. మరో 5 నిమిషాలు ఇలా చేసి నురుగు రాగానే నోట్లోని ద్రవాన్ని ఊసి నీటితో పుక్కిలించి బ్రష్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 2 గ్లాసుల నీరు తాగాలి. ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను నియమబద్ధంగా ఒకచోట కూర్చొని, మనసును ఈ ప్రక్రియమీద నిలిపి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. నోట్లో నూనె పోసుకొని అటూఇటూ తిరుగుతూ, ఆపనీ, ఈపనీ చేస్తూ ఆయిల్ పుల్లింగ్ చేయటం వల్ల ఆశించిన ఫలితం ఉండదని గ్రహించాలి.

ఉపయోగాలు

శరీరంలోని.. ముఖ్యంగా నోటిలోని హానికారక బ్యాక్టీరియా తొలగిపోయి, దంతక్షయం, నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులు వదిలిపోతాయి.

మెరుగైన చర్మ ఆరోగ్యం కోరేవారు రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం అవసరం. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటమే గాక నిగారింపును సంతరించుకొంటుంది.

నోటి ఆరోగ్యానికీ హృదయ ఆరోగ్యానికీ గల సంబంధం వల్ల ఆయిల్ పుల్లింగ్ తో గుండెజబ్బుల నివారణ సాధ్యమవుతుంది.

హార్మోన్ల ఉత్పత్తిలో అసమతుల్యతలున్నవారికి ఇది చక్కని ఫలితాన్నిస్తుంది.

మైగ్రేన్‌ నొప్పి నివారణ, చికిత్సలకు ఇది మంచి ప్రత్యామ్న్యాయం. 

ఇతర నియమాలు, జాగ్రత్తలు

 ఆయిల్ పుల్లింగ్ మొదలుపెట్టిన రెండుమూడు నిమిషాల్లోనే నోట్లోని ఆయిల్ నీరుగా మారుతుంటే నూనె మోతాదు పెంచుకోవచ్చు.

అరగంటపాటు ఆయిల్ పుల్లింగ్ చేసినా నీరుగా మారనివారు ఆయిల్ పుల్లింగ్ కి అరగంటకు ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగి 10 నిమిషాలు వాకింగ్ చేసి ఆ తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

ఆయిల్ పుల్లింగ్ చేసే సమయంలో దగ్గు, తుమ్ము వచ్చి కఫం వస్తే నోట్లోని ఆయిల్ ఊసి, నోట్లో మళ్ళీ కొంత నూనె పోసుకొని చేయాలి.

కట్టుడు పళ్ళున్న వారు వాటిని తీసి ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

గర్భిణులు, నెలసరి వచ్చిన వారు సైతం ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు.

మెరుగైన ఆరోగ్యం కోసం ఆయిల్ పుల్లింగ్ చేసేవారు పరగడుపున చేస్తే చాలు. తీవ్ర అనారోగ్య బాధితులు పరగడుపునే గాకుండా, లంచ్, డిన్నర్ లకు అరగంట ముందుగా చేయొచ్చు.

ఆయిల్ పుల్లింగ్ మొదలుపెట్టిన తొలినాళ్లలో కొందరికి దురద, పొక్కులు వంటి చర్మసమస్యలు కనిపిస్తాయి. ఈ ప్రకియను ఆపకుండా కొనసాగిస్తే 3 రోజుల్లో సమస్య తగ్గుతుంది.Recent Storiesbpositivetelugu

స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో వీరుల త్యాగం, మరెందరో మహానుభావుల స్వప్నం.. నేటి మన  స్వతంత్రం. 

MORE
bpositivetelugu

గురుదేవోభవ

మన సంస్కృతిలో గురువుకు ఎంతో విశిష్ఠమైన స్థానం ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన దేశంలో గురువు కేవలం అధ్యాపకుడు 

MORE